ఈ నెల 5న నిరసన కార్యక్రమాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఈ నెల 5న నిరసన కార్యక్రమాలు

ఈ నెల 5న నిరసన కార్యక్రమాలు

Written By news on Saturday, November 1, 2014 | 11/01/2014


కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 5న నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఈ నిరసన కార్యక్రమాల్లో ప్రజలంతా పాల్గొన్నాలని ఆయన పిలుపునిచ్చారు.
శనివారం కర్నూలులో విజయసాయిరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... టీడీపీ ఎన్నికల ముందు ప్రజలకు హమీలు గుప్పించి అధికారంలోకి వచ్చాక... ఆ హమీలను తుంగలోకి తొక్కిందని ఆయన ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమాల్లో టీడీపీ పాలనను ఎండగడతామని తెలిపారు. నంద్యాలలో స్థానిక ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి మద్దతుగా నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నామని విజయసాయిరెడ్డి తెలిపారు.
 
Share this article :

0 comments: