5న విశాఖలో వైఎస్ జగన్ మహాధర్నా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 5న విశాఖలో వైఎస్ జగన్ మహాధర్నా

5న విశాఖలో వైఎస్ జగన్ మహాధర్నా

Written By news on Wednesday, November 26, 2014 | 11/26/2014


5న విశాఖలో వైఎస్ జగన్ మహాధర్నా
విశాఖపట్నం : ఏపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట డిసెంబర్ 5న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించనున్నారు. ఈ మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ కోరారు.

ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను విశాఖపట్నంలో ఆయన ఆవిష్కరించారు. పోస్టర్ విడుదల కార్యక్రమంలో ఎమ్మెల్సీ సూర్యనారాయణ రాజు, ఎమ్మెల్యే ముత్యాలనాయుడు, అన్ని నియోజకవర్గాల ఇన్ చార్జులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, విద్యార్థి, మైనార్టీ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: