బాబుది ప్రచార ఆర్భాటమే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబుది ప్రచార ఆర్భాటమే

బాబుది ప్రచార ఆర్భాటమే

Written By news on Thursday, November 6, 2014 | 11/06/2014

బాబుది ప్రచార ఆర్భాటమే
వైఎస్సార్‌సీపీ సమరశంఖం పూరించింది. రైతు, డ్వాక్రా రుణ మాఫీ హామీ అమలు చేయలేదంటూ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. హుదూద్ తుపాను సహాయక చర్యల్లో విఫలమైందంటూ ధ్వజమెత్తింది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ బుధవారం జిల్లావ్యాప్తంగా తహశీల్దార్ కార్యాలయాల వద్ద పార్టీ భారీ ధర్నాలతో హోరెత్తించింది. పార్టీ నాయకులు,భారీ సంఖ్యలో నేతలు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కదం తొక్కారు.
 
* సర్కారు వైఫల్యాలపై ధ్వజమెత్తిన వైఎస్సార్ సీపీ నాయకులు
* చంద్రబాబువి మోసపూరిత  హామీలంటూ ఆగ్రహం
* ప్రజాపక్షాన మరిన్ని పోరాటాలు తప్పవని హెచ్చరిక
* మండల కేంద్రాలలో హోరెత్తిన ధర్నాలు
* కదంతొక్కిన వైఎస్సార్ సీపీ శ్రేణులు

సాక్షి ప్రతినిధి..విశాఖపట్నం:  తుపాను నష్టం అంచనాలపై పూర్తి నివేదికలు రూపొందించకుండా కేవలం ప్రచారార్భాటలకే సర్కారు పరిమితమవుతోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ ధ్వజమెత్తారు. విశాఖపట్నంలోని(సీతమ్మధార) అర్బన్ తహశీల్దార్ కార్యాలయం ఎదుట వైఎస్సార్‌సీపీ బుధవారం భారీ ధర్నా నిర్వహిం చింది. నగరం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ధర్నాలో గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ ప్రధాని తక్షణం రూ. వెయ్యికోట్లు నష్టపరిహారం ప్రకటించినప్పటికి కేవలం రూ. 400 కోట్లు విడదల చేసిందంటే తుపాన్ నష్టంపై ప్రభుత్వం ఇచ్చిన నివేదికలు ఎంత అసమగ్రంగా  ఉన్నాయో తెలుస్తోందన్నారు.

తుపాన్ సందర్భంగా నిత్యావసర వస్తువులలో ఎక్కువశాతం పచ్చాచొక్కాల నాయకుల గోదాములకే చేరాయని విమర్శించారు. నేటికి గ్రామీణ, గిరిజన గ్రామాల ప్రజలు విద్యుత్, నిత్యావసరాలు ఆశించినంత మేర అందక ఇబ్బందులు పడుతున్నారన్నారని విమర్శించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి గొల్ల బాబూరావు మట్లాడుతూ ఎన్నికల సమయంలో రూ. లక్షలాది హామీలు గుప్పించిన చంద్రబాబు వాటి అమలుగురించి మాత్రం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.

తుపాను బాధితులను ఆదుకోవడం కంటే కూడా నిధులు కొల్లగొట్టడం మీదే చంద్రబాబు దృష్టి సారించారని విమర్శించారు. బాబు దుష్టపాలనకు ప్రజలు బుద్ది చెప్పేందుకు జగన్ సారథ్యంలో ఉద్యమించనున్నారన్నారు. ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్ మాట్లాడుతూ గతంలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఇచ్చిన హామీలపై తొలి సంతకాలు చేయడమేకాకుండ వాటిని చిత్తశుద్దితో ప్రజలకు అంధించిన ఘనత సాదించిన ప్రజానాయకుడయ్యారన్నారు. నేడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ఒకటి, మంత్రివర్గ తీర్మానం మరొకటి, జీవో ఇంకొకటిగా చేస్తూ ప్రజలతో చెలగాటమాడుతున్నారని దుయ్యబట్టారు. పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు కమిటీలతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు.  
 
పార్టీ  రాష్ట్ర కార్యదర్శి వంశీకష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల్లో  శుష్కవాగ్ధానాలతో ప్రజలను మోసగించిన చంద్రబాబు ప్రస్తుతం తన నిజస్వరూపం చూపిస్తున్నారని విమర్శించారు. పార్టీ  రాష్ట్ర కార్యదర్శి తిప్పల గురుమూర్తి రెడ్డి మాట్లాడుతూ తుపాన్‌ను కూడా తమ రాజకీయ ప్రయోజనాలకు, జేబులు నింపుకోవడానికి చంద్రబాబు అవకాశంగా మలుచుకుంటున్నారని ఆరోపించారు.   మాజీ ఎమ్మెల్యే బలిరెడ్డి సత్యారావు, ద క్షిణ నియోజకవర్గ సమన్వయకర్త  కోలా గురువులు, రాష్ట్ర కార్యదర్శి కంపాహనోక్, నగర మహిళా అద్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్, రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రతినిధి ఫరూఖ్, కొయ్య ప్రసాదరెడ్డి ప్రసంగించారు.

కార్యక్రమంలో పార్టీ మీడియా సెల్ కన్వీనర్ జి.రవిరెడ్డి,  పక్కి దివాకర్, రాష్ట్ర యువజన విభాగం సభ్యుడు విల్లూరి భాస్కరరావు,  రాష్ట్ర బీసీ సెల్ ప్రతినిధి తుళ్లి చంద్రశేఖర్, ఎస్సీసెల్ ప్రతినిధి రెయ్యి వెంకటరమణ, మాజీ కార్పోరేటర్లు నడింపల్లి కష్ణరాజు, జి.వి.రమణి, పీతల పోలారావు, జియ్యాని శ్రీధర్, మువ్వల పోలారావు, సేనాపతి అప్పారావు, వివిధ వార్డుల ముఖ్య నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గున్నారు.  గాజువాక ధర్నాలో సమన్వయకర్త తిప్పలనాగిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు రాజకీయ జీవితమంతా మోసపూరితమేనని దుయ్యబట్టారు.

భీమిలి నియోజకవర్గంలోని ఆనందపురం, భీమిలిలలో పార్టీ భారీ ధర్నాలు నిర్వహించింది.  సమన్వయకర్త కర్రి సీతారాం మాట్లాడుతూ చంద్రబాబుకు రైతులు, పేదలు బుద్ధిచెప్పే రోజు త్వరలోనే వస్తుందని హెచ్చరించారు. పార్టీ నేతలు కోరాడ రాజబాబు, అక్రమాన వెంకటరావు, ఎస్.కరుణాకర్‌రెడ్డి, జీరు వెంకటరెడ్డిలతోపాటు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెందుర్తి ధర్నాలో  అమర్‌నాథ్‌తోపాటు పార్టీ నేతలు కొయ్య ప్రసాదరెడ్డి, సుబ్బారావు, భూపతిరాజు, పీతల విష్ణుమూర్తి, రాపర్తి మాధవరావులతోపాటు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
 
హోరెత్తిన గ్రామీణ జిల్లా
జీవీఎంసీతోపాటు, జిల్లాలోని గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాలు కూడా వైఎస్సార్‌సీపీ ధర్నాలతో దద్దరిల్లాయి. పాడేరు నియోజకవర్గంలో విస్తతంగా పార్టీ నేతలు ధర్నాలు చేశారు. ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పాడేరు, జి.మాడుగుల మండలాల్లో తహశీల్దార్ కార్యాలయాల వద్ద  ధర్నాల్లో పాల్గొని ప్రభుత్వ వైఫల్యాలపై విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు మాడుగుల,కె.కోటపాడులలో ధర్నాల్లో పాల్గొని ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారు. జెడ్పీటీసీ సభ్యురాలు జి.ప్రభావతి, మాజీ ఎంపీపీలు సన్యాసినాయుడు, డి.కొండబాబులతోపాటు పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అనకాపల్లి నియోజకవర్గంలోని అనకాపల్లి, కశింకోటలలో పార్టీ నేతలు భారీ ధర్నాలు నిర్వహించారు. అనకాపల్లిలో అమర్‌నాథ్, రాష్ట్ర పార్టీ కార్యదర్శి తిప్పల గురుమూర్తిరెడ్డి, ఆర్‌ఈసీఎస్ డెరైక్టర్ జి.శ్రీనివాసరావులతోపాటు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.. యలమంచిలి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోనూ పార్టీ నేతలు భారీ ధర్నాలు నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలు రాష్ట్ర ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడానికి సంసిద్ధమవుతున్నారన్నారు.

అరకు లోక్‌సభ నియోజకవర్గ పరిశీలకుడు బొడ్డేటి ప్రసాద్ మాట్లాడుతూ  దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి మాదిరిగానే ప్రస్తుతం వై.ఎస్.జగన్ ప్రజల పక్షాన నిలిచి చంద్రబాబు మోసాలను ఎండగడతారన్నారు. చోడవరం నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లోనూ పార్టీ భారీ స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది. సమన్వయకర్త కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ జగన్ పోరాటానికి ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తోందన్నారు.  నర్సీపట్నం నియోజకవర్గంలోని నాలుగు మండలాలు వైఎస్సార్‌సీపీ ధర్నాలతో హోరెత్తాయి. సమన్వయకర్త  పెట్ల ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ దివంగత సీఎం వై.ఎస్. మాదిరిగా రైతుసంక్షేమ పాలన అందించగల సత్త వై.ఎస్.జగన్‌కు మాత్రమే ఉందన్నారు.
 
ధర్నాలతో పాయకరావుపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాలు దద్దరిల్లాయి. ఈ సందర్భంగా సమన్వయకర్త చెంగల వెంకట్రావు మాట్లాడుతూ మోసంతో అధికారం చేపట్టిన చంద్రబాబు ఈ ఐదేళ్లూ  ప్రజలను మోసం చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ సూర్యనారాయణ రాజు మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడే నైజం నాడు వై.ఎస్.లోనూ నేడు వై.ఎస్.జగన్‌లోనే ఉన్నాయన్నారు. అరకు నియోజకవర్గంలోని హకుంపేట, పెద్దబయలు మండల కేంద్రాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ ధర్నాలు నిర్వహించారు.  
 
హామీలు మరిచిన టీడీపీ
ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీలను అధికారంలోకి వచ్చాక టీడీపీ ప్రభుత్వం పూర్తిగా తుంగలోకి తొక్కింది. ఐదు నెలలవుతున్నా రైతు, డ్వాక్రా రుణాలను రద్దు చేయలేదు. ఇంటికో ఉద్యోగమని చెప్పి ఇప్పుడు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతోపాటు ఆదర్శ రైతులు, ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించారు. హుదూద్ తుపాను పరిహారాన్ని పెంచాలి. తుపాను పరిహారం పూర్తిగా చెల్లించేంత వరకు పోరాటం తప్పదు.      - గిడ్డి ఈశ్వరి, ఎమ్మెల్యే, పాడేరు.
 
మోసగించడం బాబు నైజం
రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు మోసపూరిత ప్రకటనలు చేయడం సీఎంకు తగదు. టీడీపీ అధికారంలోకి వచ్చి ఐదు నెలలు గడిచినా ఒక్క రైతు రుణాన్ని కూడా మాఫీ చేయలేదు.  సర్వేలు, కమిటీల పేరిట తొలగించిన తెల్లరేషన్ కార్డులను, పింఛన్లను పునరుద్ధరించాలి. 80 ఏళ్ల వృద్ధుల పింఛన్లు తొలగించడం దారుణం. నిరుపేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయాలి.  
 - బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్యే, మాడుగుల
 
ప్రభుత్వంపై పోరాటం
బూటకపు హామీలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. డ్వాక్రా మహిళలు, రైతులను నిలువునా ముంచేశారు. అక్టోబర్ నుంచి కోతలేని విద్యుత్ సరఫరా ఇస్తామన్నారు. తుఫాన్‌కు విరిగిపోయిన విద్యుత్ స్తంభాలనే పునరుద్ధరించలేదు. తాగునీటికి ఇబ్బందిపడే పరిస్థితి. ప్రభుత్వం మెడలు వంచైనా హామీలు నెరవేర్చేందుకు వైఎస్సార్‌సీపీ పోరాడుతుంది. ప్రజల పక్షాన నిలుస్తుంది.
- డీవీ సూర్యనారాయణరాజు, ఎమ్మెల్సీ
Share this article :

0 comments: