సారా, విద్యావ్యాపారులు, సంచులు మోసేవారే!:రోజా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సారా, విద్యావ్యాపారులు, సంచులు మోసేవారే!:రోజా

సారా, విద్యావ్యాపారులు, సంచులు మోసేవారే!:రోజా

Written By news on Thursday, November 27, 2014 | 11/27/2014


సారా, విద్యావ్యాపారులు, సంచులు మోసేవారే!:రోజారోజా
విజయనగరం: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలో ఆయన వెంట సారా వ్యాపారం, మనీ ల్యాండరింగ్, విద్యావ్యాపారం, సంచులు మోసేవారు తప్ప సంగతి తెలిసినవారు ఎవరూ లేరని వైఎస్ఆర్ సీపి ఎమ్మెల్యే రోజా విమర్శించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని దౌర్భాగ్యస్థితిలో  చంద్రబాబు ఉన్నారని అన్నారు.

చంద్రబాబులా అబద్ధాలు చెబితే మొన్నటి ఎన్నికలలో వైఎస్ఆర్ సీపీకే అధికారం దక్కేదన్నారు. చంద్రబాబు మారారని ప్రజలు అనుకున్నారని, అయితే గతంలో కన్నా దారుణంగా, మోసగానిలా మారారన్న విషయం వారికి అర్ధమైపోయిందని చెప్పారు. చంద్రబాబు చేతకానితనం వల్లే రాష్ట్రం విడిపోవాలన్న ఆలోచన పుట్టుకొచ్చిందని రోజా అన్నారు.
Share this article :

0 comments: