మహేశ్వర్ రెడ్డి కుటుంబసభ్యులకు వైఎస్ జగన్ ఫోన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మహేశ్వర్ రెడ్డి కుటుంబసభ్యులకు వైఎస్ జగన్ ఫోన్

మహేశ్వర్ రెడ్డి కుటుంబసభ్యులకు వైఎస్ జగన్ ఫోన్

Written By news on Monday, November 10, 2014 | 11/10/2014


హైదరాబాద్ :  అసోంలో కిడ్నాప్ అయిన సివిల్ కాంట్రాక్టర్ మహేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఫోన్ లో మాట్లాడారు. ఆయన ఈ సందర్బంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని మహేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ సూచించారు. కిడ్నాప్ వ్యవహారాన్ని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ దృష్టికి తీసుకెళతామని ఆయన హామీ ఇచ్చారు. పార్టీ ఎంపీలు అవినాష్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి ఢిల్లీలో ఉండి ఈ ఘటనపై ఎప్పటికప్పుడు కేంద్రంతో సంప్రదింపులు జరపాలని వైఎస్ జగన్ ఆదేశించారు.


కాగా  ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సివిల్ కాంట్రాక్టర్ మహేశ్వర్ రెడ్డిని అసోంలోని దివాస్ జిల్లా గౌడీ(అటవీ) ప్రాంతంలో బోడో మిలిటెంట్లు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే.  మహేశ్వరరెడ్డి స్వస్థలం వైఎస్సార్ జిల్లా రామాపురం మండలం హసనాపురం.  క్లాస్‌వన్ కాంట్రాక్టర్ అయిన మహేశ్వరరెడ్డి హసనాపురం గ్రామానికి గతంలో సర్పంచ్‌గా కూడా పనిచేశారు. గత మూడేళ్ల నుంచి హైదరాబాద్ గచ్చిబౌలిలోని నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్య సుభద్రమ్మ, కూతురు నిశిత, కొడుకు మంజునాథ్ ఉన్నారు. ప్రస్తుతం మహేశ్వరరెడ్డి గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, జమ్మూకాశ్మీర్, అసోం రాష్ట్రాలలో ఐఎల్‌ఎఫ్ (రాంకీ కంపెనీ )లో సబ్ కాంట్రాక్టర్‌గా పనులు చేయిస్తున్నారు.
Share this article :

0 comments: