బాబూ ... మా పార్టీ అంటే ఎందుకంత భయం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబూ ... మా పార్టీ అంటే ఎందుకంత భయం

బాబూ ... మా పార్టీ అంటే ఎందుకంత భయం

Written By news on Saturday, November 1, 2014 | 11/01/2014


బాబూ ... మా పార్టీ అంటే ఎందుకంత భయం
హైదరాబాద్: రాష్ట్రంలో పరిపాలన రాక్షస పాలనను గుర్తు చేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ అన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టని ఆయన అభివర్ణించారు. శనివారం హైదరాబాద్ లో జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ...  ప్రతిపక్ష పార్టీని నిర్వీర్యం చేయాలనే ప్రయాత్నంలో భాగంగానే భూమా నాగిరెడ్డిపై కేసు నమోదు చేశారని ఆరోపించారు. మీ తప్పులను వేలేత్తి చూపిన మా పార్టీ వారిపై అక్రమకేసులు బనాయిస్తారా?  ఇది రాక్షసపాలన కాక మరేమంటారని వెల్లడించాలని అధికార టీడీపీని డిమాండ్ చేశారు.
ఒక విద్యార్థి మృతికి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా కుమారుడు సిద్దార్ద కారకుడంటూ మీడియాలో కథనాలు వచ్చిన తర్వాతే అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారని ఆయన గుర్తు చేశారు. ఇది వాస్తవం కాదా అని జ్యోతుల నెహ్రు సూటిగా ప్రశ్నించారు. అయినా మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎందుకంత భయమో అర్థం కావడం లేదని చంద్రబాబును ఉద్దేశించి జ్యోతుల నెహ్రు వ్యాఖ్యానించారు.
Share this article :

0 comments: