భూమా అరెస్టుపై హైకోర్టును ఆశ్రయిస్తాం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » భూమా అరెస్టుపై హైకోర్టును ఆశ్రయిస్తాం

భూమా అరెస్టుపై హైకోర్టును ఆశ్రయిస్తాం

Written By news on Wednesday, November 5, 2014 | 11/05/2014

భూమా అరెస్టుపై హైకోర్టును ఆశ్రయిస్తాం
కర్నూలు(జిల్లా పరిషత్): నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడంపై హైకోర్టును ఆశ్రయిస్తామని కర్నూలు, కోడుమూరు ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, మణిగాంధి అన్నారు. అధికార పార్టీ ఆదేశాల మేరకు తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేసిన పోలీసులు ఇబ్బంది పడక తప్పదన్నారు. మంగళవారం స్థానిక భాగ్యనగర్‌లోని వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.

అధికార పార్టీ నాయకులు పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చి అక్రమంగా భూమా నాగిరెడ్డిపై హత్యాయత్నం, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడమే గాకుండా రౌడీషీటు బనాయించారన్నారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో ప్రజాసమస్యలు లేవనెత్తే సమయంలో వాగ్వాదపడటం సాధారణమని భూమా నాగిరెడ్డి కౌన్సిల్ హాలులోకి ఆయుధాలు తీసుకెళ్లలేదని, ఎవరినీ చంపే ప్రయత్నమూ చేయలేదని, అలాంటి వ్యక్తిపై ఇన్ని కేసులు ఎలా బనాయిస్తారని ప్రశ్నించారు.

రాష్ట్ర చరిత్రలో ఒక ఎమ్మెల్యేపై ఇన్ని కేసులు బనాయించడం ఇదే మొదటిసారన్నారు. బయట ఎక్కడో జరిగిన సంఘటనకు కూడా భూమాను బాధ్యున్ని చేశారన్నారు. మూడుసార్లు ఎంపీగా, మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని, ఆయనపై ఎలాంటి కేసులు కూడా లేవన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసేందుకే భూ మాను అక్రమంగా అరెస్టు చేశారని విమర్శిం ్డచారు.

రైతురుణమాఫీ, డ్వాక్రా సంఘాల రుణమాఫీ, పింఛన్లు, రేషన్‌కార్డుల్లో కోత, నిరుద్యోగులకు భృతి, ఇంటింటికి ఓ ఉద్యోగం వంటి హామీలను నెరవేర్చలేక, వాటిపై ఆందోళన చేస్తారన్న భయంతో అక్రమ అరెస్టులకు సిద్ధపడుతున్నారని విమర్శించారు. అధికార పార్టీల నాయకులు చెప్పినట్లు వ్యవహరిస్తే ప్రజల్లో పోలీసులపై నమ్మకం పోతుందని, తద్వారా సమాజంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుందన్నారు.

వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు కొత్తకోట ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని సింగపూర్, టోక్యో చేస్తానని ప్రకటించే చంద్రబాబు బ్రిటిష్ పాలనను తలపిస్తున్నారని విమర్శించారు. జిల్లాలో యథేచ్ఛగా అక్రమ ఇసుక, మైనింగ్, కల్తీ మద్యం రవాణా జరుగుతున్నా పోలీసులు వాటిపై చర్య లు తీసుకోవడం లేదన్నారు. సమావేశంలో మాజీ కార్పొరేటర్లు తోట వెంకటకృష్ణారెడ్డి, నరసింహులు యాదవ్ పాల్గొన్నారు.


 టీడీపీ నేతలు బనాయించిన అక్రమ కేసులో అరెస్టయిన వైఎస్సార్‌సీపీ ముఖ్య నేత, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని మెరుగైన వైద్యం కోసం కర్నూలు పోలీసులు మంగళవారం రాత్రి  హైదరాబాద్‌లోని  నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. నిమ్స్ పాత భవనం ఐసీపీయూ బెడ్ నెంబర్ 6లో అడ్మిట్ చేశా రు. వైద్యులు ఆయన ఛాతీని ఎక్స్‌రే తీశారు. నంద్యాల మున్సిపల్ సమావేశంలో గొడవ కేసులో భూమాను స్థానిక పోలీసులు ఈనెల ఒకటిన అరెస్ట్ చేశారు. రిమాం డ్‌లో ఉన్న ఆయనను వెంటనే వైద్యం కోసం స్థానిక మెడికేర్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు మంగళవారం ఛాతీలో నొప్పి రావడంతో పోలీసులు మధ్యాహ్నం 3.25 గంటలకు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు. గుండె వ్యాధుల చికిత్స విభాగం వైద్యులు పరీక్షలు చేసి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించాలని నిర్ణయిం చారు. ఇదే విషయాన్ని పోలీసు అధికారులకు వివరించారు. కర్నూలు ఎమ్మెల్యే ఎస్.వి.మోహన్‌రెడ్డి వైద్యులతో మాట్లాడారు. సాయంత్రం 6.20 గంటలకు కార్డియాలజీ ఐసీసీయూ విభాగం నుంచి వీల్‌చైర్‌లో బయటికి వచ్చిన భూమానాగిరెడ్డిని అంబులెన్స్‌లో పోలీసు ఎస్కార్ట్‌తో హైదరాబాద్‌కు తరలించారు.
Share this article :

0 comments: