ప్రజలను విస్మరిస్తే.. పోరాటమే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజలను విస్మరిస్తే.. పోరాటమే

ప్రజలను విస్మరిస్తే.. పోరాటమే

Written By news on Thursday, November 20, 2014 | 11/20/2014

ప్రజలను విస్మరిస్తే.. పోరాటమే
నల్లగొండ/నల్లగొండ టుటౌన్ : పేదప్రజల పక్షాన వైఎస్సార్‌సీపీ అవిశ్రాంత పోరాటం చేస్తుందని...ప్రజా సమస్యలను విస్మరిస్తున్న ప్రభుత్వ పనితీరు ఎండగట్టడంతో పాటు..ప్రజలకు కొండంత అండగా ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దివంగత నేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు సీఎం కేసీఆర్ తూట్లు పొడుస్తున్నాడని విమర్శించారు. అర్హుల పేరుతో ఫించన్లలో కోత విధిస్తున్నారని, దీంతో పేదవారికి తీరని నష్టం జరుగుతోందన్నారు. ఫ్లోరైడ్ బాధితుల వయోపరిమితిని 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించేవిధంగా పింఛన్ నిబంధనల్లో సడలింపు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైద్యపరంగా వెనుకబడిన జిల్లాకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి నిమ్స్ ఆస్పత్రి మంజూరు చేశారన్నారు. అయితే ఈ ఆస్పత్రి పూర్తిచేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిమ్స్ కోసం త్వరలో పార్టీ తరపున ఉద్యమిస్తామని తెలిపారు.

 పార్టీ బలోపేతం దిశగా
 ప్రతి పేదవాడి మోములో చిరునవ్వు చిందాలన్న వైఎస్ ఆశయాన్ని నెరవేర్చేందుకు వైఎస్సార్‌సీపీ పాటుపడుతుందన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా త్వరలో జిల్లా కమిటీ ప్రక్షాళన చేస్తామని చెప్పారు. ప్రక్షాళనలో భాగంగా కమిటీలో మార్పులు చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న వారికి తప్పకు గుర్తింపు లభిస్తుంద ని పొంగులేటి చెప్పారు.

 ఎవరెవరు ఏమన్నారంటే....
 కోదాడ నియోజకవర్గ నేత ఎర్నేని వెంకటరత్నంబాబు మాట్లాడుతూ వైఎస్ మరణం తరువాత ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు తగ్గిస్తున్నాయన్నారు. రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసి ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామన్నారు. పార్టీ ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ ఇరుగు సునీల్‌కుమార్ మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు ప్రజలకు అండగా ఉండి పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. నకిరేకల్ నియోజకవర్గ నాయకుడు నకిరేకంటి స్వామి మాట్లాడుతూ వైఎస్ పింఛన్లు ఇస్తే కేసీఆర్ ప్రభుత్వం తొలగిస్తూ 100 మందికి ఇచ్చే వాటిని 10 మందికే ఇవ్వడంతో బెంగతో వృద్ధులు రాలిపొతున్నారని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా నాయకులు గూడూరు జయపాల్‌రెడ్డి, మైనార్టీ సెల్ జిల్లా కన్వీనర్ ఎండి. సలీం, మహబూబ్‌నగర్ జిల్లా నాయకులు శ్యామ్‌సుందర్‌రెడ్డి, రవీందర్, ఎస్సీసెల్ రాష్ట్ర కమిటీ సభ్యులు బెదరకోట భాస్కర్, మేడిశెట్టి యాదయ్య, దొంతిరెడ్డి సైదిరెడ్డి, ఎంపీటీసీ కట్టెబోయిన నాగరాజు, ఎండీ.ఫయాజ్, చింత నవీన్, లక్ష్మికాంత్, వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు.

 ప్రాజెక్టులు పూర్తి చేయాలి
 - వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి
 టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలవుతున్నా జిల్లాలోని ప్రాజెక్టుల పూర్తికి చర్యలు తీసుకోకుండా నిర్లక్షంగా వ్యవహరిస్తున్నది. డిండి, నక్కలగండి ప్రాజెక్టులు పూర్తిచేసి ప్రజలకు సాగు, తాగు నీరివ్వాలి. శ్రీ రాంసాగర్ మూడవ దశ పనులు పూర్తిచేస్తే తుంగతుర్తి ప్రాంతానికి నీరు అందుతుంది. జిల్లాలో ఒక్క సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కూడా లేకపోవడం శోచనీయం. ఫ్లోరైడ్ భూతం పట్టి పీడిస్తున్నా ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధిలేదు. రైతులకు రుణమాఫీ చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందింది.  రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించకున్నా ప్రభుత్వం పట్టంచుకోవడం లేదు.  జిల్లాలో 650 గ్రామాలకు కృష్ణా జలాలు అందించిన ఘనత దివంగత సీఎం వైఎస్‌కే దక్కింది.

 ఫాంహౌస్‌పై ఉన్న శ్రద్ధ రాష్ట్రంపై లేదు : తాటి
 వైఎస్సార్ సీపీ శాసన సభానేత తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దేశంలోనే ఫ్లోరైడ్ సమస్య అధికంగా ఈ జిల్లాలో ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడంలేదన్నారు. సీఎం కేసీఆర్ తన ఫాంహౌజ్‌ను అభివృద్ధి చేసుకుంటూ రాష్ట్రాన్ని విస్మరించారని, ఫాంహౌజ్‌పై ఉన్న శ్రద్ధ రాష్ట్రంపై లేదని ఆరోపించారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరూ సింగపూర్ జపం చేస్తూ ప్రజలను మభ్య పెడుతున్నాని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. పింఛన్లు తొలగించి పేద ప్రజల పొట్ట గొడితే ప్రజలు సహించరని హెచ్చరించారు. ప్రభుత్వంలోనే తిరుగుబాటు వచ్చే అవకాశం కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతుందన్నారు. టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ పింఛన్ల కోతలపై ధర్నా చేశారని, ఇది ప్రభుత్వానికి సిగ్గు చేటని ఎద్దేవా చేశారు. నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం వెళ్లే ప్రతిపక్ష ఎమ్మెల్యేలను మభ్యపెట్టి పార్టీలో చేర్చుకోవడం నీచ రాజకీయమన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సమస్యలు అసెంబ్లీలో చర్యకు రాకుండా మంత్రులు పక్కకు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

 పాలకులకు ఫ్లోరైడ్ సమస్య కనిపించడం లేదా..
 - మాజీ ఎమ్మెల్సీ రెహమాన్
 పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ రెహమాన్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజలను పట్టి పీడుస్తున్న ఫ్లోరైడ్ సమస్య పాలకులకు ఎందుకు కనిపించడంలేదని ప్రశ్నించారు. జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌లు తనకు మిత్రులేనని వారికి ఫ్లోరైడ్ సమస్య పట్టకపోవడం బాధాకరమన్నారు. ప్రజల సమస్యలపై అసెంబ్లీలో వైఎస్సార్‌సీపీ నిలదీస్తన్నారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ల్ ఇచ్చిన మహానేత వైఎస్సార్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఇంటికి ఒకే పింఛన్ అంటే పేదలు ఎలా బతకాలని ప్రశ్నించారు.

 వైఎస్ మరణం తర్వాత రాష్ట్రం రావణకాష్టం
 - శివకుమార్, పార్టీ రాష్ట్ర నాయకుడు
 పార్టీ రాష్ట్ర నాయకుడు శివకుమార్ మాట్లాడుతూ వైఎస్సార్ మరణం తరువాత రాష్ట్రం రావణ కాష్టంలా తయారైందని, ఆయన ప్రవేశపట్టిన సంక్షేమ పథకాలను నీరు గార్తున్నారని ఆరోపించారు. పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు చిత్తశుద్ధితో పని చేయాలని కోరారు. కేసీఆర్ చెబుతున్న పిట్టల దొర మాటలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు.

 వైఎస్సార్ సీపీపై విషప్రచారం
 - సూర్యప్రకాశ్‌రావు, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు
 పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లా సూర్యప్రకాశ్‌రావు మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీపై టీడీపీ విష ప్రచారం చేస్తుందని విమర్శించారు. ఎన్‌టీఆర్, వైఎస్సార్‌లు జనరంజక సీఎంలు అని, చంద్రబాబు వెన్నుపోటు పొడిచే సీఎం అన్నారు. 100 అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తున్నాడని ఆరోపించారు. ప్రజల కోసం
 పోరాడే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు అండగా ఉండి పార్టీని
 పటిష్టపర్చాలన్నారు.
 
Share this article :

0 comments: