విశాఖలో 'దేశా'న్ని ఓడించిన వైకాపా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విశాఖలో 'దేశా'న్ని ఓడించిన వైకాపా

విశాఖలో 'దేశా'న్ని ఓడించిన వైకాపా

Written By news on Sunday, November 30, 2014 | 11/30/2014

విశాఖ కార్పొరేషన్ లో గుర్తింపు యూనియన్ కు జరిగిన ఎన్నికల్లో వైకాపా మద్దతు ప్యానెల్ విజయం సాధించింది. భీమిలి, అనకాపల్లి విలీనం అయిన తరువాత తొలిసారి జరిగిన ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మద్దతుతో బరిలోకి దిగిన గ్రేటర్ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ఓటమి పాలయింది. వైకాపా మద్దతులో బరిలో దిగిన విఎమ్ సి స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ 153ఓట్ల మెజారిటీతో గెలుపొందింది.  మొత్తం 3511 ఓట్లుకు గాను, 3143 ఓట్లు పోలయ్యాయి. తెలుగుదేశం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఎంత ప్రలోభపెట్టినా, భయభ్రాంతులను చేసినా, విజయం తమదే అయిందిన గెలుపొందిన సంఘ ప్రధానకార్యదర్శి వామనరావు అన్నారు. త్వరలో విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల వైఖరి ఈ విధంగా వెల్లడి కావడంతో, వైకాపా వర్గాలు ఆనందంగా వున్నాయి. - See more at: http://telugu.greatandhra.com/politics/political-news/visakha-lo-desani-vodinchina-ycp-57668.html#sthash.h3h4XpwC.dpuf
Share this article :

0 comments: