నేడు చెవిరెడ్డి ప్రమాణ స్వీకారం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేడు చెవిరెడ్డి ప్రమాణ స్వీకారం

నేడు చెవిరెడ్డి ప్రమాణ స్వీకారం

Written By news on Monday, November 24, 2014 | 11/24/2014

నేడు చెవిరెడ్డి ప్రమాణ స్వీకారం
తిరుపతి రూరల్: రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైన అసెంబ్లీ అంచనాల కమిటీ సభ్యునిగా చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నేడు హైదరాబాద్‌లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. అసెంబ్లీ కమిటీహాల్లో జరిగే కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి స్పీకర్ కోడెల శివప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రమాణస్వీకారం అనంతరం కేబినెట్ హోదా కలిగిన ఈ కమిటీ మొదటి సమావేశం అక్కడే జరగనుంది. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఓటింగ్ ద్వారా ఈ కమిటీని ఎన్నుకున్నారు.

ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో చేపట్టే పనిఅంచనాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. ఈ కమిటీ అమోదం తర్వాతే అసెంబ్లీకి పంపుతారు. దేశ, విదేశాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను కమిటీ సభ్యులు పరీశిలించి ప్రభుత్వనికి నివేదికలు అందిస్తారు. నెలకు ఒకసారి రాష్ట్ర స్థాయిలో సమావేశమై, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తారు. జిల్లాల్లో పర్యటించి అభివృద్ధి పనులను, పనుల అంచనాలను పరిశీలిస్తారు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతుంటే సంబంధిత అధికారులపై చర్యలకు సిఫార్సు చేస్తారు.
 
సీమ నుంచి చెవిరెడ్డికి ఛాన్స్
న్యాయశాస్త్ర పట్టభద్రుడు, సామాజిక శాస్త్రంలో డాక్టరేట్ సాధించిన చెవిరెడ్డి భా స్కర్‌రెడ్డికి ప్రతిష్టాత్మకమైన అసెంబ్లీ అంచనాల కమిటీలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అవకాశం కల్పించారు. రాష్ట్ర స్థాయిలో వైఎస్సార్‌సీపీ నుంచి ముగ్గురికి మాత్రమే అవకాశం ఉండడంతో రాయలసీమ జిల్లాల నుంచి తన సన్నిహితుడైన చెవిరెడ్డిని అధ్యక్షుడు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆయన వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా అభివృద్ధి పనులు జరిగేలా కృషి చేస్తామని చెవిరెడ్డి స్పష్టం చేశారు.
Share this article :

0 comments: