పంపుసెట్లకు ఎగనామం పెట్టడానికేనా ఆధార్? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పంపుసెట్లకు ఎగనామం పెట్టడానికేనా ఆధార్?

పంపుసెట్లకు ఎగనామం పెట్టడానికేనా ఆధార్?

Written By news on Thursday, November 20, 2014 | 11/20/2014

ఉచిత విద్యుత్తుకు కూడా ఆధార్ తో లింకు పెట్టడమంటే.. 40 శాతం పంపుసెట్లకు ఎగనామం పెట్టడమేనని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఆధార్ పై విరుచుకుపడ్డ టీడీపీ నేతలు.. ఇప్పుడెందుకు ఇలా మారారని ఆమె ప్రశ్నించారు. అధికారంలో లేనప్పుడోమాట, ఉన్న తర్వాత మరో మాట ఎందుకని అడిగారు. ఆధార్ వంకతో లక్షలాది లబ్ధిదారుల పొట్ట కొడుతున్నారని, అసలు సంక్షేమ పథకాలకు ఆధార్ లింకు వద్దని సుప్రీంకోర్టు చెప్పిన విషయం మీకు తెలియదా అని నిలదీశారు. మీ సౌకర్యాలకు లేని పిసినారితనం పేదల దగ్గరకు వచ్చేసరికి ఎందుకని అడిగారు. తక్షణం మీ ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు.

దివంగత వైఎస్ఆర్ పై ఒక చానల్, పత్రిక విష ప్రచారం చేస్తున్నాయని వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. బతికుండగానే ఎన్టీఆర్ ను సమాధి చేసిన చేతుల్లో మీదీ ఒకటన్న విషయం గుర్తులేదా అని చంద్రబాబును ప్రశ్నించారు. వైఎస్ఆర్ మరణించినా మీ గుండెల్లో నిద్రపోతున్నారని, అందుకే ఈ ఉలికిపాటని అన్నారు. వైఎస్ఆర్ సీపీ కార్యాలయం మార్చి కొన్ని రోజులు కూడా కాకముందే స్థలాభావం వల్ల పక్కన ఉంచిన వైఎస్ఆర్ విగ్రహంపై కథనాలు ప్రసారం చేశారని ఆమె అన్నారు.
Share this article :

0 comments: