* జగన్ అధ్యక్షతన సమావేశం
* రెండు రాష్ట్రాల సమస్యలనూ పార్లమెంటులో ప్రస్తావించాలని నిర్ణయం
* ‘హుద్‌హుద్’ బాధితులకు కేంద్రం నుంచి ఇతోధిక సాయం కోరతాం
* ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు జాతీయ హోదాకు డిమాండ్
* రైల్వే పెండింగ్ ప్రాజెక్టుల సాధనకు కృషి
* పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి వెల్లడి
అనంతరం మేకపాటి రాజ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రను కుది పేసిన హుద్‌హుద్ తుపాను బాధితులను ఆదుకోవడానికి ఇతోధిక సాయం అందించాలని కేం ద్రాన్ని కోరాలని నిర్ణయించినట్లు తెలిపారు. తు పానులో సర్వం కోల్పోయిన వారికి సాయమందించాలని కేంద్రంలోని వివిధ శాఖలను కోరతామన్నారు. ఇందుకోసం పార్లమెంటు సమావేశాల సమయంలో వ్యవసాయ మంత్రితో పాటు పలువురు మంత్రులను, అధికారులను కలసి చర్చిస్తామన్నారు. తెలంగాణకు కీలకమైన ‘ప్రాణహిత - చేవెళ్ల’ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కూడా డిమాండ్ చేయాలని నిర్ణయించామన్నారు. రైల్వే శాఖలో పెండింగ్ ప్రాజెక్టుల సాధనకు కూడా కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్ర విభజన చట్టం ఆమోదం పొందిన సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఈ హోదా ఇవ్వడంలో జరుగుతున్న జాప్యాన్ని కూడా పార్లమెంటులో కేంద్రం దృష్టికి తె స్తామని చెప్పారు.
ఎస్పీవై, గీతపై అనర్హత వేటు వేయాల్సిందే
లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి, అరకు ఎంపీ కొత్తపల్లి గీతను అనర్హులుగా ప్రకటించాలని మేకపా టి డిమాండ్ చేశారు. గెలిచిన 4 రోజులకే ఎస్పీవై రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబును కలసి టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారని, ఆయనపై ఇప్పటికే లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశామని చెప్పారు. ఎస్పీవై రెడ్డిపై చర్య తీసుకునే అంశం పార్లమెంటు ప్రివిలేజెస్ కమిటీ ముందుందని, ఆ కమిటీ చైర్మన్ అహ్లూవాలియాను కలసి దీనిపై చర్చిస్తామని తెలిపారు.
టీడీపీలో చేరానని, అనర్హతకు గురైతే మళ్లీ పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందుతానని ఆనాడు చెప్పిన ఎస్పీవై రెడ్డి ఇప్పుడేమో వైఎస్సార్‌సీపీని వదిలి వెళ్లలేదని చెబుతూ అనర్హత నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని అన్నారు. కొత్తపల్లి గీత పార్టీ నుంచి వెళ్లి పోవడమే కాక , చంద్రబాబుపై ప్రశంసలు కురిపిస్తున్నారన్నారు. ఆమె విజయవాడలో జరిగిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి కూడా హాజరయ్యారన్నారు. గీత విషయాన్ని ఈ పార్లమెంటు సమావేశాల్లో స్పీకర్ దృష్టికి తీసుకెళతామన్నారు. ఒక పార్టీ తరఫున ఎన్నికై మరో పార్టీలోకి వెళ్లిన వారిని అన ర్హులుగా ప్రకటించాలని, లేకుంటే పార్లమెంటులో చేసిన ఫిరాయింపు నిరోధక చట్టానికి విలువే లేకుండా పోతుందని మేకపాటి అభిప్రాయపడ్డారు.
ఆ ఏడు మండలాలను ఆదుకోవాలి
పోలవరం ప్రాజెక్టు ముంపునకు గురయ్యే ఏడు మండలాలను ఏపీలో కలిపినా అక్కడి ప్రజల ఆలనా, పాలనను రెండు ప్రభుత్వాలూ పట్టించుకోవడంలేదని, ఆ మండలాల ప్రజలకు మంచి జరిగేలా పార్లమెంటులో పోరాడుతామని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. రెండు రాష్ట్రాల ప్రజల సమస్యలపై ఎప్పటికపుడు అప్రమత్తంగా ఉండి పార్లమెంటులో లేవనెత్తాలని పార్టీ అధ్యక్షుడు జగన్ తమను ఆదేశించారని వివరించారు.
0 comments:
Post a Comment