చంద్రబాబుపై కేసులో మాత్రం సిబ్బంది లేరని చెప్పారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబుపై కేసులో మాత్రం సిబ్బంది లేరని చెప్పారు

చంద్రబాబుపై కేసులో మాత్రం సిబ్బంది లేరని చెప్పారు

Written By news on Thursday, November 27, 2014 | 11/27/2014


అధికార పార్టీల చేతుల్లో సీబీఐ కీలుబొమ్మ
* లోక్‌సభలో స్పెషల్ పోలీసు సవరణ బిల్లుపై చర్చలో మిథున్‌రెడ్డి ధ్వజం
కొందరిని రాజకీయంగా అణగదొక్కేందుకు సీబీఐని వాడుకుంటున్నారు
వైఎస్ జగన్ కేసులో 22 బృందాలతో దర్యాప్తు చేశారు
అదే చంద్రబాబుపై కేసులో మాత్రం సిబ్బంది లేరని చెప్పారు

 
 సాక్షి, న్యూఢిల్లీ: సీబీఐ అధికార పార్టీల చేతుల్లో కీలుబొమ్మగా మారుతోందని వైఎస్సార్ సీపీ ఎంపీ పి.వి.మిథున్‌రెడ్డి లోక్‌సభలో ధ్వజమెత్తారు. సీబీఐ కేవలం రాజకీయ కక్ష సాధింపులకు ఉపకరణంగా మారుతోందన్నారు. సీబీఐ డెరైక్టర్ నియామకానికి సంబంధించిన బిల్లుపై బుధవారం లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.‘సీబీఐ డెరైక్టర్ నియామకానికి సంబంధించి ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్(సవరణ) బిల్లు-2014కు మేం మద్దతిస్తున్నాం.
 
  ప్రజల విశాల ప్రయోజనాలను దృష్టి లో పెట్టుకున్నప్పుడు.. నియామక కమిటీలో ప్ర తిపక్ష నేత సభ్యుడు అవ్వాలా? లేక విపక్షంలో ఉన్న అతిపెద్ద పార్టీకి చెందిన నేత సభ్యుడు అవ్వాలా? అన్నది అంత ముఖ్య విషయం కాదు. అధికార పార్టీల చేతుల్లో సీబీఐ ఒక కీలుబొమ్మగా మారుతోందన్నదే ఇక్కడ ముఖ్యమైన విషయంగా పరిగణించాలి. అధికారంలో ఉన్న పార్టీలు కేవలం ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే ందుకు, వాటిని నియంత్రించేందుకు,అణగదొక్కేందుకు సీబీఐని  ఉపకరణంగా వాడుకుంటున్నాయి.తమ రా జకీయ కక్షసాధింపు కోసం సీబీఐని వాడుకుంటున్నాయి’’ అని మిథున్‌రెడ్డి విమర్శించారు.
 
 సీబీఐ తీరును ‘సుప్రీం’ తప్పుబట్టింది
 ‘‘ఇటీవల హవాలా కేసు, తదితర ఇతర కేసుల్లో సీబీఐ తీరును సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సీబీఐని ‘పంజరంలో ఉన్న చిలుక’గా సాక్షాత్తూ సుప్రీంకోర్టే అభివర్ణించింది. సీబీఐ ఎవరిపైనా పక్షపాత వైఖరి లేకుండా స్వతంత్రంగా పనిచేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు చేసిన ఈ అభివర్ణనే చెబుతోంది. మా నాయకుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలో లేకున్నా, ఆయన ఏ ఫైలుపైనా సంతకం చేయకున్నా... ఆయనపై సీబీఐ కేసు నమోదు చేసింది. కేవలం ఆయన అధికార పార్టీ నుంచి బయటకు వచ్చారన్న కారణంతోనే అది జరిగింది. అధికార పార్టీ ఆజ్ఞల మేరకే సీబీఐ నడుచుకుంది’’ అని ఆయన గుర్తుచేశారు. ‘‘మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే..అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు పై దర్యాప్తు జరపాలంటే తమకు సిబ్బంది కొరత ఉందని చెప్పిన సీబీఐ.. అదే సమయంలో జగన్‌మోహన్‌రెడ్డిపై 22 బృందాలతో దర్యాప్తు జరిపింది. ఇక్కడ సీబీఐ ద్వంద్వ ప్రమాణాలను అర్థం చేసుకోవచ్చు.అధికార పార్టీ చేతిలో కీలుబొమ్మని అర్థం చేసుకోవచ్చు’’ అని అన్నారు.
 
 అధికార పార్టీలు ఉల్లంఘిస్తున్నాయి..
 ‘‘1999లో సుప్రీంకోర్టు ఒక కేసులో స్పష్టంగా ఆదేశించింది. దర్యాప్తు సంస్థల పరిధిలో జోక్యం చేసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది.దీన్ని అధికార పార్టీలు ఉల్లంఘిస్తున్నాయి.సుప్రీంకో ర్టు చెప్పినట్టుగా.. ఈ సంస్థకు పూర్తి స్వేచ్ఛ ఉండాలి. స్వతంత్ర వ్యవస్థగా పనిచేయాలి. ఒక రాజకీయ ఉపకరణంగా కాకుండా ప్రజలకు న్యా యం చేసే సంస్థగా ఉండాలి. చట్టాన్ని పరిరక్షించేదిగా ఉండాలిగానీ చట్టాన్ని తయారు చేసే వారి చేతిలో ఒక ఉపకరణంలా ఉండకూడదు..’’ అని మిథున్‌రెడ్డి అన్నారు.
Share this article :

0 comments: