ఆర్థిక మంత్రి ఆదుకుంటామన్నారు: వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆర్థిక మంత్రి ఆదుకుంటామన్నారు: వైఎస్ జగన్

ఆర్థిక మంత్రి ఆదుకుంటామన్నారు: వైఎస్ జగన్

Written By news on Saturday, November 8, 2014 | 11/08/2014


ఆర్థిక మంత్రి ఆదుకుంటామన్నారు: వైఎస్ జగన్
న్యూఢిల్లీ : తుపాను బాధితులకు తప్పకుండా మంచి చేస్తామని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హుదూద్ తుఫాను బాధితులను ఆదుకుంటామని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చెప్పినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో తమ పార్టీకి చెందిన పలువురు ఎంపీలతో కలిసి ఆయన అరుణ్ జైట్లీని శనివారం సాయంత్రం కలిశారు. ఆయన చెప్పిన ప్రధానాంశాలు ఇవీ..
''నష్టానికి సంబంధించిన నివేదికలు ఇంకా తమ వద్దకు పూర్తిగా రాలేదని అరుణ్ జైట్లీ చెప్పారు. మేం చెప్పినదంతా సావధానంగా విన్నారు. విని మంచి చేస్తామని తెలిపారు. ప్రత్యేకహోదా గురించి చర్చ ఏమీ జరగలేదు. కేవలం హుదూద్ బాధితులను ఆదుకోవాలని మాత్రమే ఇప్పుడు అడిగాం. కేంద్ర ప్రభుత్వం నుంచి సాయాన్ని రాబట్టడంలో రాష్ట్రప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పదిరోజుల పాటు అన్ని గ్రామాలు తిరిగి, ప్రభుత్వం వాళ్లకు ఏం చేసిందోనన్న విషయాన్ని అందరికీ చెప్పుకుంటూనే వచ్చాం. ప్రభుత్వం నూటికి నూరుపాళ్లు విఫలమైందన్న విషయాన్ని నాతోపాటు తిరిగిన టీవీ ఛానళ్ల క్లిప్పింగులు చూస్తే, ప్రజలే ఏం చెప్పారో తెలుస్తుంది. వాళ్లకిచ్చేది 25 కిలోల బియ్యమట. మామూలుగా అయితే దాన్ని రేషన్ దుకాణాల్లో రూపాయికి ఇస్తారు. అదికూడా అన్ని గ్రామాల్లో ఇవ్వలేదు. అధికారులు ఎవరూ రాలేదు. ఆ పదిరోజులు ఎవరు ఏమన్నారో అందరికీ ప్రజలే చెప్పారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసిన పని వల్ల పంటబీమాను కట్టకపోవడంతో కనీసం నష్టపోయిన పంటకు రైతులకు బీమా కూడా అందలేదు. ప్రభుత్వం పూర్తిగా విఫలం కావడం వల్లే ప్రధాన ప్రతిపక్షంగా మేం ఇక్కడకు వచ్చి, కేంద్ర ఆర్థికమంత్రికి వినతి పత్రం ఇచ్చాం'' అని ఆయన అన్నారు.
Share this article :

0 comments: