Home »
» తెలంగాణ బడ్జెట్ అంకెల గారడీ: పొంగులేటి
తెలంగాణ బడ్జెట్ అంకెల గారడీ: పొంగులేటి
హైదరాబాద్ : తెలంగాణ బడ్జెట్ అంకెల గారడీ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. టీఆర్ ఎస్ ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ అంటూ పొంతన లేని అంకెలతో గారడీ చేసిందని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను లక్ష కోట్ల బడ్జెట్ అనడం హాస్యాస్పదంగా ఉందని పొంగులేటి అన్నారు.తెలంగాణ బడ్జెట్ అంతా అస్పష్టతగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు విమర్శించారు. తెలంగాణ బడ్జెట్ లెక్కలు ప్రజల్ని మోసం చేసే విధంగా ఉన్నాయన్నారు.
0 comments:
Post a Comment