అధికారపార్టీ కనుసన్నల్లో పోలీసులు: వాసిరెడ్డి పద్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అధికారపార్టీ కనుసన్నల్లో పోలీసులు: వాసిరెడ్డి పద్మ

అధికారపార్టీ కనుసన్నల్లో పోలీసులు: వాసిరెడ్డి పద్మ

Written By news on Wednesday, November 26, 2014 | 11/26/2014


అధికారపార్టీ కనుసన్నల్లో పోలీసులు: వాసిరెడ్డి పద్మ
హైదరాబాద్ : అధికార పార్టీ కనుసన్నల్లో పోలీసు యంత్రాంగం అంతా నడుచుకుంటోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారపార్టీ దౌర్జన్యాలు, అరాచకాలకు అడ్డు అదుపు లేదని ఆమె అన్నారు. భూమా నాగిరెడ్డిపై అక్రమ కేసులు పెట్టి బెయిల్ రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశారని, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద కూడా ఇలాగే కేసులు పెట్టారని ఆమె చెప్పారు.

కర్నూలు జిల్లా పరిషత్ ఛైర్మన్ రాజశేఖరగౌడ్ కల్తీమద్యం కేసులో నిందితుడిగా ఉన్నా ఆయనను అరెస్టు చేయలేదని, ఏపీలో అరాచక పాలన కొనసాగుతోందని వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి టీడీపీ నేతలు అవాకులు, చవాకులు పేలుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును పాపభీతి వెంటాడుతోందని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతికహక్కు టీడీపీ నేతలకు లేదన్నారు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీని బలవంతంగా లాక్కున్న మీరా.. మా పార్టీని విమర్శించేది అంటూ ఆమె మండిపడ్డారు.
Share this article :

0 comments: