క్షేత్రస్థాయిలో కమిటీలను నియమించి రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుస్తామన్నారు. విశాఖపట్నం నగరానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎనలేని సేవలందించి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారని విజయసాయిరెడ్డి అన్నారు. రాష్ట్రానికి ఏమీ చేయని చంద్రబాబు మాత్రం విశాఖకు అతా తానే చేసినట్లు చెప్పుకొంటున్నారన్నారు.
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కంపెనీలను నష్టాల్లోకి నెట్టి, ప్రైవేటీకరణకుపూనుకున్నారని, ఐటీ, ఫార్మా, సినీ పరిశ్రమల అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలనే ఉద్దేశంతోనే పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని విశాఖలో ఏర్పాటుచేశామని ఆయన తెలిపారు. చంద్రబాబు పాలనలో నష్టాల్లోఉ న్న ప్రభుత్వరంగ సంస్థలను వైఎస్ఆర్ పాలనలో అభివృద్ధిలోకితెచ్చారని, పార్టీ కోసం ప్రతి ఒక్కరూ సేవ చేస్తే వారి సేవలను పార్టీ గుర్తిస్తుందని ఆయన చెప్పారు
0 comments:
Post a Comment