చంద్రబాబు మోసాలపై రేపే ధర్నాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబు మోసాలపై రేపే ధర్నాలు

చంద్రబాబు మోసాలపై రేపే ధర్నాలు

Written By news on Tuesday, November 4, 2014 | 11/04/2014


చంద్రబాబు మోసాలపై రేపే ధర్నాలు
* విజయవంతానికి వైఎస్సార్‌సీపీ పిలుపు
* ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొని నిరసన తెలపాలి: వాసిరెడ్డి పద్మ


సాక్షి, హైదరాబాద్:చంద్రబాబునాయుడు తన ఐదు నెలల పాలనలో చేసిన యాభై మోసాలకు వ్యతిరేకంగా ఈ నెల 5వ తేదీన మండల కార్యాలయాల వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ నిర్వహించ తలపెట్టిన ధర్నాలను విజయవంతం చేయాలని పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ కోరారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయం (లోటస్‌పాండ్)లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 13 జిల్లాల్లోని అన్ని మండల కేంద్రాల్లో జరిగే ఈ ధర్నాల్లో ప్రజలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని చంద్రబాబు పాలనపై నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు.

అధికారంలోకి వచ్చి ఐదు నెలలు గడిచినా చంద్రబాబు ఇప్పటివరకు ఒక్క పైసా రుణాన్ని కూడా రద్దు చేయలేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో తాము 5న తలపెట్టిన ధర్నాకు ప్రజలు, పార్టీ శ్రేణుల నుంచి మంచి స్పందన లభించనున్నట్లుగా.. ఇటీవల పార్టీ త్రిసభ్య కమిటీ జరిపిన పర్యటనల సందర్భంగా వెల్లడైందని ఆమె తెలిపారు.ఐదు డిమాండ్లతో ఈ ధర్నాలు చేయాలని తమ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు నిచ్చారని పద్మ వివరించారు.

తక్షణం రైతులు, డ్వాక్రా మహిళల రుణాల మాఫీ, తొలగించిన 16 లక్షల తెల్లకార్డుల్లో అర్హులకు పునరుద్ధరణ, రైతులకు బ్యాంకుల నుంచి తక్షణం రుణ సాయం,   తొలగించిన 13 లక్షల మంది పింఛనుదారుల్లో అర్హులకు పునరుద్ధరణ, ఫీజు రీరుుంబర్స్‌మెంట్, ఉపకార వేతనాలు చెల్లింపు డిమాండ్లని తెలిపారు.
Share this article :

0 comments: