వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియామకాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియామకాలు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియామకాలు

Written By news on Sunday, November 23, 2014 | 11/23/2014

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియామకాలు
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీ విభాగాలకు సంబంధించి పలు నియామాకాలను ప్రకటించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా కర్నూలు జిల్లాకు చెందిన డి.యుగంధర్ , గుంటూరు జిల్లా పెదకూరపాడుకు చెందిన పి.హనిమి రెడ్డి, తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన ఎస్.అశోక్ లను నియమించారు.  రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శులుగా కృష్ణా జిల్లాకు చెందిన తాతినేని పద్మావతి, కర్నూలుకు చెందిన కాటసాని జ్యోతిలను నియమించారు. నెల్లూరు జిల్లాకు చెందిన నేదురుమల్లి పద్మనాభ రెడ్డిని సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్(సిజిసి) సభ్యునిగా నియమించారు. గుంటూరుకు చెందిన పేరిరెడ్డిని నరసరావుపేట లోక్ సభ నియోజకవర్గ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు.

రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శిగా కడప జిల్లా పులివెందులకు చెందిన వి.అరవింద్ నాథ్ రెడ్డిని, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా విజయనగరం జిల్లా కురుపాంకు చెందిన ఎస్.పరీక్షిత్ రాజును నియమించారు. యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన కర్రి నారాయణ రావు, చిత్తూరు జిల్లా సత్యవేడుకు చెందిన ఏ.విద్యానాథ్ రెడ్డి, కడపకు చెందిన నిమ్మకాయల సుధాకర్ రెడ్డిలను నియమించారు.
Share this article :

0 comments: