స్టీల్‌ప్లాంట్ నష్టాన్ని కేంద్రం భరించాలి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » స్టీల్‌ప్లాంట్ నష్టాన్ని కేంద్రం భరించాలి

స్టీల్‌ప్లాంట్ నష్టాన్ని కేంద్రం భరించాలి

Written By news on Sunday, November 23, 2014 | 11/23/2014

స్టీల్‌ప్లాంట్ నష్టాన్ని కేంద్రం భరించాలి
  • ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి
  • వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి స్టీల్ వైఎస్సార్ టీయూసీ వినతి
ఉక్కునగరం: తుపాను వల్ల స్టీల్‌ప్లాంట్‌కు వాటిల్లిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం భరిం చేలా ఒత్తిడి తేవాలని స్టీల్ వైఎస్సార్ టీయూ సీ నాయకులు కోరారు. శనివారం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి నేతృత్వంలో నాయకులు వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని కలసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. హుద్‌హుద్ తుపాను వల్ల ప్లాంట్‌కు భారీ నష్టం వాటిల్లిందన్నారు.

తుపాను నష్టం కేంద్రం భరించి తక్షణ సాయం కింద స్లీల్‌ప్లాంట్‌కు రూ.1000 కోట్లు అందించాలని, ప్లాంట్‌కు మూడేళ్లు తగ్గకుండా ట్యాక్స్ హాలిడే ప్రకటించాలని కోరారు. సొంత గనులు లేకపోవడంతో ఉత్పత్తి వ్యయం పెరుగుతున్నందున సొంత గనులు కేటాయించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి వై.మస్తానప్ప, పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ సభ్యుడు మార్టుపూడి పరదేశి, స్టూడెంట్ విభాగం నేత నాగేంద్ర, యూని యన్ ఉపాధ్యక్షులు వెంపాడ అప్పారావు, మొల్లి చిన్న తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: