
గత 7 నెలల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3700 కోట్ల రూపాయలను పింఛన్ల కోసం ఖర్చు చేయాల్సివుండగా, కేవలం 1338 కోట్లు మాత్రమే కేటాయించిందని వైఎస్ జగన్ చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పింఛన్లను పెంచామని చెప్పుకుంటూ, మరోవైపు లక్షల సంఖ్యలో కోత వేశారని విమర్శించారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీకి...టీడీపీకి ఓట్ల తేడా అయిదు లక్షలేనని వైఎస్ జగన్ అన్నారు. ముఖ్యమంత్రి కావడానికి చంద్రబాబు ఎన్నో అబద్ధాలు చెప్పారని అన్నారు. చంద్రబాబులా అబద్ధాలు చెప్పిఉంటే వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చేందన్నారు. చంద్రబాబుకు లేనిదీ...మనకు ఉన్నది ...దేవుడి దయ అని వైఎస్ జగన్ అన్నారు.
0 comments:
Post a Comment