నేడు విశాఖ జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమీక్ష - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేడు విశాఖ జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమీక్ష

నేడు విశాఖ జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమీక్ష

Written By news on Friday, November 21, 2014 | 11/21/2014


నేడు విశాఖ జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమీక్ష
హైదరాబాద్: చంద్రబాబు నాయుడు ప్రభుత్వ మోసపూరిత వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 5వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నా నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం విశాఖపట్నం జిల్లాకు చెందిన ఆ పార్టీ నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
లోటస్ పాండ్ లోని వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అలాగే జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జగన్ జిల్లా నేతలతో ఈ సందర్భంగా చర్చించనున్నారు. కాగా ధర్నా అంశంపై వైఎస్ జగన్ ఇప్పటికే వివిధ జిల్లాలకు చెందిన నేతలు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 5వ తేదీన విశాఖ కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాలో వైఎస్ జగన్ పాల్గొనున్నారు.
Share this article :

0 comments: