ప్రైవేట్ వర్సిటీల బిల్లును వ్యతిరేకించండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రైవేట్ వర్సిటీల బిల్లును వ్యతిరేకించండి

ప్రైవేట్ వర్సిటీల బిల్లును వ్యతిరేకించండి

Written By news on Tuesday, November 4, 2014 | 11/04/2014


ప్రైవేట్ వర్సిటీల బిల్లును వ్యతిరేకించండి
వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌కు విద్యార్థుల ఐక్యవేదిక విజ్ఞప్తి

సాక్షి, హైదరాబాద్: పేద విద్యార్థుల ప్రయోజనాలకు తీవ్రంగా హాని కలిగించే ప్రైవేటు విశ్వవిద్యాలయాల బిల్లును చంద్రబాబు నాయుడి ప్రభుత్వం తీసుకు రావాలని చూస్తోందని, దీనిని అసెంబ్లీలో వ్యతిరేకించాలని ఐదు విద్యార్థి సంఘాలతో కూడిన ఐక్యవేదిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డికి విజ్ఞప్తి చేసింది. ఐక్య వేదిక నేతలు సోమవారం వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో జగన్‌మోహన్‌రెడ్డిని కలసి ఒక వినతిపత్రం అందజేశారు.

ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేసే కుట్ర: ఎస్‌ఎఫ్‌ఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి నూర్ మహ్మద్ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలోని వర్సిటీలను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని విమర్శించారు. ప్రైవేట్ వర్సిటీలు వస్తే వాటిల్లే నష్టాలను తాము జగన్‌కు వివరించామన్నారు.  ఆయన సానుకూలంగా విని విద్యార్థులకు అండగా నిలుస్తామన్నారని వెల్లడించారు.
Share this article :

0 comments: