వైఎస్ఆర్ సీపీ అండగా.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ సీపీ అండగా..

వైఎస్ఆర్ సీపీ అండగా..

Written By news on Wednesday, November 26, 2014 | 11/26/2014


'చంద్రబాబును నమ్మలేకపోతున్నాం'ఏపీ కొత్తరాజధాని సరిహద్దులు
గుంటూరు: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని నమ్మలేకపోతున్నామని శాఖమూరు, అనంతవరం గ్రామాల రైతులు చెప్పారు. రాజధాని కోసం భూములు ఇస్తే, రుణమాఫీలా చేస్తారేమోనని భయంగా ఉందన్నారు. భూములు ఇవ్వడానికి పలు గ్రామాల రైతులు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. రైతులు, కూలీల అభిప్రాయం తెలుసుకునేందుకు వైఎస్ఆర్ సీపీ కమిటీ సభ్యులు ఈరోజు ఆయా గ్రామాలలో పర్యటించారు.

ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ రైతులు ఎవరూ అధైర్యపడవద్దని, వైఎస్ఆర్ సీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రైతులు, కూలీల అభిప్రాయాలు తెలుసుకునేందుకే తాము ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. ఏ వర్గానికి నష్టం జరిగినా పోరాటానికి తాము సిద్ధంగా ఉంటామని చెప్పారు. కూలీలకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపిన తరువాతే భూమిని సేకరించాలని వారు అన్నారు. రైతుల డిమాండ్లు అన్నిటినీ ఏపీ ప్రభుత్వం పరిష్కరించాలని వారు కోరారు
Share this article :

0 comments: