
* కమలాపురం, మైదుకూరు నియోజకవర్గాల్లో పర్యటన
* పాలగిరిలో వైఎస్ విగ్రహావిష్కరణ
* పసుపు రైతుల దీనస్థితిపై అసెంబ్లీలో చర్చిస్తానని హామీ
సాక్షి ప్రతినిధి, కడప: అధికారమే లక్ష్యంగా అలవికాని హామీలు గుప్పించిన చంద్రబాబు అధికారంలోకి రాగానే ప్రజలకు పంగనామాలు పెట్టారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన శనివారం కమలాపురం, మైదుకూరు నియోజకవర్గాల్లో పర్యటించారు. కమలాపురం నియోజకవర్గంలోని పాలగిరిలో ప్రతిభ బయోటెక్ ఎండీ ఐ.రాజశేఖర్‌రెడ్డి నెలకొల్పిన దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఓబులాపురంలో వెంకటరమణ, గురివిరెడ్డి, తిరుపాలయ్య పొలాలను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ... ‘‘దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు రాజకీయాలు చూశాం... ఇవాళ రాజకీయాలు చూస్తున్నాం.
అప్పట్లో మాట ఇస్తే ఆ మాట కోసం పరితపించేవారు. ఇవాళ అధికారం కోస మే దిగజారిపోయి రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో ఏవే వో హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక మరో మాట మాట్లాడుతున్నారు’’ అని విమర్శించారు. రాజకీయాల్లో ఒక మాటంటూ ఇస్తే, ఆ మాటకోసం ఎందాకైనా వెళ్లాలన్నారు. ఆ మాటే శిలా శాసనంగా ఉండాలన్నారు. ‘‘ఎకరాకు రూ.లక్ష పెట్టుబడి పెట్టి మైదుకూరు వెరైటీ రకం పసుపు సాగు చేశాం. ఇటీవల కలుపు నివారణకు ఓడీసీ మందు, సీడ్ మందు పిచికారీ చేశాం. పదిరోజుల తర్వాత ఎండిపోతూ పంట క్షీణించింది.
మాకు అన్యాయం జరిగిందని ఆందోళన చేస్తే పోలీసులతో తరిమారు. లాఠీ చార్జి చేయించారు. ఆదుకోవాలయ్యా...’’అని రైతు ప్రతినిధులు లెక్కల వెంకటరెడ్డి, పోలు కొండారెడ్డిలు జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై అసెంబ్లీలో చర్చిస్తానని వారికి హామీ ఇచ్చారు. పంట నష్టపోయిన రైతులకు ఇన్సూరెన్స్ దక్కకపోవడానికి కేవలం సీఎంవైఖరే కారణమని ధ్వజమెత్తారు. పంట రుణాలు రెన్య్సూవల్స్ చేసి ఉంటే బీమా వర్తించేదని, రుణమాఫీ కారణంగా రైతులెవరూ రుణాలు రెన్సూవల్స్ చేసుకోకపోవడంతో ఈరోజు బీమా కోల్పోయారని చెప్పారు. ఇదే విషయంపై మరోమారు జిల్లా కలెక్టర్‌ను కలిసి ఎంపీ అవినాష్‌రెడ్డితోపాటు రైతు ప్రతినిధులు బృందంగా వెళ్లి ఫిర్యాదు చేయాలని సూచించారు.
0 comments:
Post a Comment