గురుకుల హాస్టల్ లో ఎంపీ పొంగులేటి తనిఖీలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గురుకుల హాస్టల్ లో ఎంపీ పొంగులేటి తనిఖీలు

గురుకుల హాస్టల్ లో ఎంపీ పొంగులేటి తనిఖీలు

Written By news on Sunday, November 23, 2014 | 11/23/2014

గురుకుల హాస్టల్ లో ఎంపీ పొంగులేటి తనిఖీలు
ఖమ్మం: ఖమ్మం జిల్లా కల్లూరులోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల హాస్టల్ ను ఖమ్మం ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. గురుకులంలోబాత్ రూమ్ లు, మంచినీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నాయని విద్యార్థులు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదు చేశారు. అలాగే తమకు వడ్డించే ఆహారం పదార్ధాలు కూడా నాసిరకంగా ఉన్నాయని విద్యార్థులు ఆరోపించారు.
దాంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురుకుల నిర్వహకులపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని నిర్వహకులను హెచ్చరించారు. గురుకులంలో మౌలిక సదుపాయాల వసతులకు ఎంపీ ల్యాడ్స్ నుంచి నిధులు కేటాయిస్తానని విద్యార్థులకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు.
 
Share this article :

0 comments: