ఆ 24 ప్రశ్నలకు గంటా సమాధానం చెప్పాలి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆ 24 ప్రశ్నలకు గంటా సమాధానం చెప్పాలి

ఆ 24 ప్రశ్నలకు గంటా సమాధానం చెప్పాలి

Written By news on Friday, December 5, 2014 | 12/05/2014హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ ఆర్ సీపీ మహాధర్నాలు విజయవంతమయ్యాయని, ప్రజలనుంచి అనూహ్యమైన స్పందన వచ్చిందని వైఎస్ ఆర్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె.. రుణమాఫీపై చంద్రబాబు విధాన ప్రకటన చేసిన 24 గంటల్లోపే ధర్నాలు విజయవంతమయ్యాయన్నారు. దీని బట్టి ప్రజాగ్రహం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందన్నారు. అన్నిజిల్లాల్లో ఆంక్షలు పెట్టినా ప్రజాస్పందన వెల్లివెత్తిందని వాసిరెడ్డి పద్మ తెలిపారు.

విశాఖ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు అమర్నాథ్ వేసిన 24 ప్రశ్నలకు మంత్రి గంటా శ్రీనివాసరావు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఆరు నెలల్లో ఇంత ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న టీడీపీ సిగ్గుతో తలదించుకోవాలని  ఘాటుగా విమర్శించారు. వైఎస్సార్ సీపీ తలపెట్టిన మహాధర్నాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ వాసిరెడ్డి పద్మ కృతజ్ఞతలు తెలిపారు.
Share this article :

0 comments: