ప్రజలను మోసం చేసిన చంద్రబాబు 420 కేసుకు అర్హుడే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజలను మోసం చేసిన చంద్రబాబు 420 కేసుకు అర్హుడే

ప్రజలను మోసం చేసిన చంద్రబాబు 420 కేసుకు అర్హుడే

Written By news on Friday, December 5, 2014 | 12/05/2014

అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఏపీలో 86మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడటానికి బాబు విధానాలే కారణమని విమర్శించారు. అందుకు బేషరతుగా రైతు, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేయాల్సిందేనని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. 

చంద్రబాబు అబద్దాల బాబుగా మారిపోయారని విమర్శించారు. భారత చట్టాల ప్రకారం ప్రజలను మోసం చేసిన చంద్రబాబు 420 కేసుకు అర్హుడేనన్నారు. బినామీ ఆస్తుల పరిరక్షణకే చంద్రబాబు సింగపూర్, జపాన్ పర్యటనలు చేశారని దుయ్యబట్టారు. చంద్రబాబుకు ప్రజాప్రయోజనాల కంటే వ్యాపార ప్రయోజనాలే ముఖ్యమయ్యాయని ఆయన విమర్శించారు.  జనవరిలో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ రెండు రోజుల దీక్ష చేయనున్నట్టు విజయసాయిరెడ్డి తెలిపారు.

Share this article :

0 comments: