సాయంత్రం 5గంటలకు వైఎస్ జగన్ ప్రెస్ మీట్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సాయంత్రం 5గంటలకు వైఎస్ జగన్ ప్రెస్ మీట్

సాయంత్రం 5గంటలకు వైఎస్ జగన్ ప్రెస్ మీట్

Written By news on Thursday, December 4, 2014 | 12/04/2014


సాయంత్రం 5గంటలకు వైఎస్ జగన్ ప్రెస్ మీట్
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం సాయంత్రం అయిదు గంటలకు విలేకర్ల సమావేశం నిర్వహించనున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్ఆర్ సీపీ సమరశంఖం పూరించనుంది. ఎన్నికల హామీలను గాలికొదిలేసిన ప్రభుత్వ పెద్దలపై ప్రజా పోరాటానికి విశాఖపట్నం వేదికగా నిలవనుంది.

విశాఖ మహాధర్నాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొననున్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ సీపీ ధర్నాలు చేపట్టనున్న విషయం తెలిసిందే. మరోవైపు వైఎస్ జగన్ మహాధర్నా అనగానే...చంద్రబాబు నాయుడు హడావుడిగా రుణమాఫీపై ఈరోజు విధాన ప్రకటన చేయటం గమనార్హం.
Share this article :

0 comments: