పింఛన్ వస్తోందా పెద్దమ్మా..? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పింఛన్ వస్తోందా పెద్దమ్మా..?

పింఛన్ వస్తోందా పెద్దమ్మా..?

Written By news on Thursday, December 11, 2014 | 12/11/2014


పింఛన్ వస్తోందా పెద్దమ్మా..?
పరామర్శ యాత్ర నుంచి   ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘పింఛన్లు వస్తున్నాయా పెద్దమ్మా... పిల్లలేం చేస్తున్నారు..? పంటలు పండుతున్నాయా? రాజన్న ప్రవేశపెట్టి పెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంటుతో మీకు ఉపయోగం జరిగిందా..’’ అంటూ పరామర్శకు వెళ్లిన ప్రతి చోట షర్మిల జనంతో మమేకమయ్యారు. కుటుంబంలో ఒకరిగా కలిసిపోయి వారి బాగోగులు తెలుసుకున్నారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మహబూబ్‌నగర్ జిల్లాలో చేపట్టిన పరామర్శ యాత్ర బుధవారం మూడోరోజుకు చేరుకుంది. కొల్లాపూర్, వనపర్తి, ఆలంపూర్, గద్వాల, మక్త ల్, దేవరకద్ర నియోజకవర్గాల మీదుగా సుమా రు 300 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయినవారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
 
పెంట్లపల్లి, చిట్యాల, రాణిపేట, నందిన్నె, చిన్న వడ్డెమాన్, కొన్నూరు గ్రామాల్లో వారి కుటుంబ సభ్యులను కలిసి, ధైర్యం చెప్పారు. ఒక్కో కుటుంబంతో గంటసేపు గడిపారు. ఆయా కుటుంబాలకు అవసరమైన సహకారం అందించాల్సిందిగా పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డిలకు సూచించారు.
 
 పేదల వెంటే జగనన్న కుటుంబం
 
 వైఎస్ మరణాన్ని జీర్ణించుకోలేక పెంట్లపల్లిలో చనిపోయిన లచ్చమ్మ, చిట్యాలలో మణెమ్మ, రాణిపేటలో దస్తగిరమ్మ, నందిన్నెలో ఎర్ర నర్సింహారెడ్డి, జూరాలలో కుర్మన్న, చిన్న వడ్డెమాన్‌లో బక్కప్ప కుటుంబాలను షర్మిల పరామర్శించారు. ‘నా తండ్రి చనిపోతే ఆ బాధ భరించలేక వందల మంది గుండెలు ఆగడం.. వారి ప్రాణం కన్నా మా నాన్నే వారికి ఎక్కువవడం ఏ జన్మ అనుబంధమో పెద్దమ్మా...’ అంటూ నందిన్నెలో ఎర్ర నర్సింహారెడ్డి భార్య లక్ష్మిని షర్మిల ఓదార్చడం అక్కడున్న వారిని కదిలించింది. జగనన్న కుటుంబం పేదల వెంట ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. ఇళ్లల్లో వారిచ్చిన జ్యూస్ తాగి కుటుంబ సభ్యులను దగ్గరికి తీసుకున్నారు. బుధవారం ఏకంగా 15 గంటలకుపైగా షర్మిల పరామర్శ యాత్ర కొనసాగించారు. ఎక్కువ భాగం గతుకులతో కూడిన మట్టి రోడ్ల మీదుగానే ప్రయాణం సాగింది. కొల్లాపూర్‌లో ఉదయం 9 గంటలకు మొదలైన యాత్ర రాత్రి 12 గంటల తర్వాతా కొనసాగింది. పలుచోట్ల వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
 
 చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల
 
 వనపర్తిలో ప్రజల కోరిక మేరకు షర్మిల మాట్లాడారు. వైఎస్ పట్ల మహబూబ్‌నగర్ జిల్లా ప్రజ లు చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞతలు తెలి పారు. కోట్లాది మంది గుండెల్లో ఇంకా రాజన్న కొలువుండడం, ఆయన గుర్తొస్తే కోట్లాది మంది కళ్లల్లో నీరొలకడం తమ పూర్వ జన్మ సుకృతమన్నారు. ఈ సందర్భంగా వైఎస్‌పై అభిమానంతో వచ్చిన యువకులు ‘జై తెలంగాణ’ అనడంతో షర్మిల కూడా ‘జై తెలంగాణ’ అని నినదించారు.  ధరూర్‌లో తెలంగాణ పోరాటయోధురాలు చాకలి ఐలమ్మ చిత్రపటానికి, వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పరామర్శ యాత్రలో పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,  జిల్లా పార్టీ కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి, నాయకులు కొం డా రాఘవరెడ్డి, సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి, ముస్తా ఫా, మామిడి శ్యాంసుందర్ రెడ్డి, బీస్వ రవీంద ర్, జి.రాంభూపాల్ రెడ్డి, భగవంత్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
Share this article :

0 comments: