అమ్మ దీవెన, అన్న ఆశీర్వాదంతో... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అమ్మ దీవెన, అన్న ఆశీర్వాదంతో...

అమ్మ దీవెన, అన్న ఆశీర్వాదంతో...

Written By ysrcongress on Monday, December 8, 2014 | 12/08/2014


హైదరాబాద్ : అమ్మ దీవెన, అన్న ఆశీర్వాదం, అభిమానుల కేరింతల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు  వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో పరామర్శ యాత్రకు బయలుదేరారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌ నుంచి ఆమె సోమవారం ఉదయం మహబూబ్‌నగర్‌ జిల్లాకు బయలు దేరారు. ఈ సందర్భంగా అభిమానులు నినాదాలతో లోటస్ పాండ్ హోరెత్తించారు.

మనిషికి మనిషే అండ. కష్టకాలంలో ఒక్కమాట అంతులేని ధైర్యాన్నిస్తుంది.గుండె బాధను కొంతైన దూరం చేస్తుంది. రక్తం పంచుకోకపోయిన వారు తమ కుటుంబీకులే అనుకున్నారు.  మహానేత మరణం తట్టుకోలేక చనిపోయిన కుటుంబాలను తమ ఆత్మీయులు అనుకున్నారు. పగిలిన గుండెలకు అండగా.. మేమున్నామంటూ  రాజన్న తనయ షర్మిల తెలంగాణలో పరామర్మ యాత్రకు బయల్దేరారు.
    
ఓ మహానేత మరణం..తెలుగు జాతి గుండెల్లో మరణమృదంగం మోగించింది. పెద్దాయన లేరని తెలిసి వందల గుండెలు పగిలిపోయాయి. వైఎస్ఆర్ నవ్వు ఇకలేదని తెలిసి అభిమాన హృదయాలు పగిలిపోయాయి. ఇలా చనిపోయిన వందలాది మంది కుటుంబాలను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమ కుటుంబంగా భావించారు . నల్లకాల్వ సాక్షిగా మాట ఇచ్చారు. మాట  ప్రకారం ఓదార్పు యాత్ర చేపట్టారు. తనవారి కోసం కొండలు కోనలు తిరిగారు..మారుమూల గ్రామాలకు వెళ్లారు. చలి..ఎండా...వానలెక్క చేయకుండా తమ వారిని కలుసుకుని గుండెధైర్యం చెప్పారు.

ఒక్కమాట రాష్ట్ర రాజకీయాలను మార్చేసింది. వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డిలోని పట్టుదల వైఎస్ఆర్‌ను ప్రజల ముందు నిలబెట్టింది. రాజకీయాలు రాక్షసత్వాన్ని ప్రదర్శించాయి. ఓదార్పుయాత్రకు ఆటంకాలు. కానీ..లెక్కచేయలేదు. మాట కోసం వెన్నుచూపలేదు. ముందుకు నడిచారు..నాన్న కోసం..నాన్న ఆశయాల కోసం..ముందుకు సాగిపోయారు. ఇంతలో..రాజకీయాలు..రాక్షసత్వాన్ని ప్రదర్శించడమే కాదు..కర్కశత్వాన్ని కూడా చూపించాయి. అప్పుడు..నేన్నానంటూ అన్న ఆశీర్వాదంతో  జగనన్న వదిలిన బాణాన్ని అంటూ షర్మిల  ప్రజా క్షేత్రంలోకి దూసుకొచ్చారు

పాదయాత్రలో ప్రజల కష్టాలు  తెలుసుకున్నారు. మహిళల బాధలు విన్నారు. విద్యార్ధులు వెతలు చూశారు. అన్నదాతల చెమట విలువ తెలుసుకున్నారు. చేనేతల ఎముకలు అరగడం చూశారు. ప్రజాక్షేత్రం షర్మిల ఒక పాఠశాలైంది.  ఇడుపులపాయ నుంచి  ప్రారంభమైన మరో ప్రజాప్రస్థానం..శ్రీకాకుళం చేరే నాటికి జన మహాసముద్రమైంది.2500 గ్రామాలు, 116 నియోజకవర్గాలు, 14 జిల్లాలగుండా సాగిన మరో ప్రజాప్రస్థానంతో షర్మిల ప్రపంచరికార్డు సృష్టించారు.

అనివార్య కారణాలు వలన తెలంగాణలో వాయిదా పడిన ఓదార్పు యాత్రను షర్మిల పరామర్శ పేరుతో శ్రీకారం చుట్టారు. తనవారి కోసం అన్న ఆశీర్వాదంతో  ప్రజాక్షేత్రంలోకి అడుగు పెడుతున్నారు. తండ్రి ఆశయం కోసం..అన్న  మాట  కోసం షర్మిల ప్రజాక్షేత్రంలో వేసే ప్రతి అడుగు మరో ప్రజాప్రస్థానాన్ని గుర్తుకు తెస్తూనే ఉంటుంది.

ఆ నవ్వులో వైఎస్ఆర్ కనిపిస్తారు.. ఆ నడకలో వైఎస్ఆర్ ఆశయాలు కళ్లకు కడతాయి. ఆ పట్టుదల వైఎస్ఆర్ చనిపోలేదని చెబుతూనే ఉంటుంది. మరోప్రజాప్రస్థానంలో ఆ పాదాలు 3,112 కిలో మీటర్లు నడిస్తే..ఇప్పుడు ఆ చేతులు తమవారిని పరామర్శించబోతున్నాయి. అప్పుడు.ఇప్పుడూ  ఒక్కటే ఆశయం..వైఎస్ఆర్‌ బాట..అన్న మాట.
Share this article :

0 comments: