
కొత్తూరు: దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అకాలమరణాన్ని తట్టుకోలేక మండలంలో ఇద్దరు మృతిచెందారు. వారి కుటుంబాలను పరామర్శించేందుకు శుక్రవారం మధ్యాహ్నం మండలానికి రానున్నారు. మొదట నర్సప్పగూడలో మృతి చెందిన పెంటమీది అండాలు కుటుంబసభ్యులను పరామర్శించి అక్కడి నుండి చేగూరు మీదుగా స్టేషన్ తిమ్మాపూర్- మల్లాపూ ర్ గ్రామానికి వెళ్లి పిన్నింటి నాగిరెడ్డి కుటుంబసభ్యులను పరామర్శిస్తారని పార్టీ షాద్‌నగర్ నియోజకవర్గ సమన్వయ కర్త మామిడి శ్యాంసుందర్‌రెడ్డి తెలిపా రు. పార్టీ శ్రేణులు, వైఎస్ అభిమానులు అధికసంఖ్యలో తరలిరావాలని కోరారు.
బాలానగర్: దివంగత సీఎం వైఎస్‌ఆర్ మృతిని తట్టుకోలేక మృతిచెందిన బాలానగర్ మండలం గుండ్లపొట్లపల్లి గ్రామానికి చెందిన ఆకుల శంకరయ్య కుటుంబాన్ని శుక్రవారం షర్మిల పరామర్శించనున్నారు. వైఎస్‌ఆర్ మృతిని జీర్ణించుకోలేక గుండెఆగిన ప్రతిఒక్కరి కుటుంబాన్ని కలిసి పరామర్శిస్తానని అప్పట్లో వైఎస్‌ఆర్ తనయుడు వైఎస్ జగ న్‌మోహన్‌రెడ్డి ఇడుపులపాయలో ఇచ్చిన మాటకోసం ఆమె నేడు గుండ్లపొట్లపల్లికి రానున్నారు.
0 comments:
Post a Comment