సలహాలు అడుగుతారు.. చెబితే ఎదురుదాడి చేస్తారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సలహాలు అడుగుతారు.. చెబితే ఎదురుదాడి చేస్తారు

సలహాలు అడుగుతారు.. చెబితే ఎదురుదాడి చేస్తారు

Written By news on Monday, December 22, 2014 | 12/22/2014


హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సోమవారం ప్రవేశపెట్టిన సీఆర్డీఏ బిల్లు సందర్భంగా టీడీపీ అనుసరిస్తున్న వైఖరిని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని తప్పుబట్టారు. బిల్లులు ఒకటి చెబితే మరొకటి మాట్లాడుతున్నారన్నారు. ఏదో చేస్తున్నామని చెబుతున్నారే గానీ.. ఏం చేస్తున్నారో తెలియడం లేదన్నారు. ప్రతిపక్ష పార్టీని సలహాలు ఇవ్వమని అడుగుతారు.. చెబితే ఎదురు దాడి చేస్తారంటూ నాని ఎద్దేవా చేశారు.
 
మూడు పంటలు పండే భూములను లాక్కోవద్దని ఈ సందర్భంగా నాని స్పష్టం చేశారు. అవసరమైతే అటవీ భూములను ఉపయోగించుకోవాలని సూచించారు. రైతులు భూములు ఇస్తే తీసుకోవాలని,, బలవంతంగా తీసుకోవాలని చూస్తే వైఎస్సార్ సీపీ పోరాటం సాగిస్తుందన్నారు.
Share this article :

0 comments: