రూట్‌మ్యాప్ ఖరారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రూట్‌మ్యాప్ ఖరారు

రూట్‌మ్యాప్ ఖరారు

Written By news on Tuesday, December 2, 2014 | 12/02/2014

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణవార్తను విని తట్టుకోలేక మృతిచెందిన కుటుంబాలను పరామర్శించడానికి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించనున్న వైఎస్సార్‌సీపీ నాయకురాలు షర్మిల రూట్‌మ్యాప్‌ను ఆ పార్టీ వర్గాలు సోమవారం ఖరారు చేశాయి. ఈ నెల 8న హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్ నుంచి ఆమె బయలుదేరి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, నల్లగొండ జిల్లా మాల్ మీదుగా కురిమేడుకు చేరుకుంటారు. అక్కడ వైఎస్ విగ్రహానికి నివాళి అర్పిస్తారు.

మహబూబ్‌నగర్ జిల్లాలోని మాడ్గుల మండలంలోని బ్రాహ్మణపల్లికి ప్రవేశిస్తారు. అక్కడ  వైఎస్ విగ్రహానికి నివాళి అర్పిస్తారు. అనంతరం బ్రాహ్మణపల్లి నుంచి రెడ్డిపురం ద్వారా ఇర్విన్‌కు చేరుకుంటారు. అక్కడ వైఎస్‌ఆర్ కోసం మరణించిన రాయపు రెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం ఆమన్‌గల్‌కు చేరుకొని వైఎస్ విగ్రహానికి నివాళులర్పిస్తారు.

అనంతరం తలకొండపల్లి ద్వారా దేవునిపడకల్ గ్రామానికి వెళ్లి తుమ్మల నర్సింహ కుటుంబాన్ని పరామర్శిస్తారు. తర్వాత దేవునిపడకల్ నుంచి తలకొండపల్లి ద్వారా వెల్జాలకు వచ్చి ఎస్.అంజమ్మ హరిమోహనాచారి కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం వెల్జాల నుంచి మిడ్జిల్ ద్వారా కల్వకుర్తికి  చేరుకొని వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. రాత్రి అక్కడే బస చేస్తారు.
 
9వ తేదీన ఉదయం కల్వకుర్తి నుంచి అమ్రాబాద్‌కు చేరుకొని అక్కడ బోగం రంగయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు. అక్కడనుంచి అచ్చంపేటకు వెళ్లి వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. తర్వాత  తెల్కపల్లి, నాగర్‌కర్నూల్ టౌన్‌కు వెళ్లి వైఎస్ విగ్రహానికి నివాళి అర్పిస్తారు. అక్కడ నుంచి కల్వకోల్, కొండ్రావ్‌పల్లి మీదుగా ఎత్తం గ్రామానికి చేరుకొని అక్కడ పుట్టపాగ నర్సింహ కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం ఎత్తం నుంచి సింగోటం మీదుగా కొల్లాపూర్‌కు వెళ్లి కటిక రాంచంద్రయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు. రాత్రి కొల్లాపూర్‌లోనే బస చేస్తారు.
 
10వ తేదీన యాత్ర ఉదయం కొల్లాపూర్ నుంచి ప్రారంభం అవుతుంది. షర్మిల కొల్లాపూర్ నుంచి పెంట్లవెల్లికి చేరుకొని అక్కడ లచ్చమ్మ కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం గోవర్ధనగిరికి చేరుకొని వైఎస్ విగ్రహానికి నివాళి అర్పిస్తారు. అనంతరం వీపనగండ్ల, పాన్‌గల్ మీదుగా అన్నారం వెళ్లి అక్కడ వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.తర్వాత వనపర్తి మీదుగా చిట్యాలకు వెళ్లి గొల్లమన్నెమ్మ కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం వనపర్తి మీదుగా రాణిపేట వెళ్లి దస్తగిరమ్మ కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం పెబ్బేర్, ఎర్రవల్లి చౌరస్తా మీదుగా జమ్మిచేడ్‌కు చేరుకొని వైఎస్ విగ్రహానికి నివాళి అర్పిస్తారు.

అనంతరం గద్వాలలో వైఎస్ విగ్రహానికి నివాళి అర్పిస్తారు. అక్కడి నుంచి ధరూర్ మీదుగా నందిన్నె గ్రామానికి వెళ్లి ఎర్ర నర్సింహారెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం జూరాల డ్యామ్, ఆత్మకూర్ ద్వారా జూరాల గ్రామానికి వెళ్లి హరిజన్ కుర్మన్న కుటుంబాన్ని పరామర్శిస్తారు. జూరాల నుంచి తిరిగి ఆత్మకూర్ మీదుగా కొన్నూర్ గ్రామంలో నాగమ్మ కుటుంబాన్ని పరామర్శిస్తారు.

అనంతరం కొన్నూర్ నుంచి కొత్తకోట, భూత్పూర్, మహబూబ్‌నగర్‌లలో పర్యటించి వైఎస్ విగ్రహాలకు నివాళులర్పిస్తారు. తర్వాత మహబూబ్‌నగర్ టౌన్ నుంచి కోస్గి వెళ్లి కటికె బాలరాజును, అమీన్‌కుంట్లకు వెళ్లి జంగం గురుబసవయ్య కుటుంబాలను పరామర్శిస్తారు. కోస్గి నుంచి దౌల్తాబాద్‌కు వెళ్లి వైఎస్ విగ్రహానికి నివాళి అర్పిస్తారు. అక్కడే ఇముడాపూర్‌కు చెందిన మీదింటి పకీరప్ప కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం దౌల్తాబాద్ నుంచి కొడంగల్ చేరుకొని అక్కడ రాత్రి బస చేస్తారు.

11వ తేదీన షర్మిల యాత్ర కొడంగల్ నుంచి పరిగి, లాల్‌పహాడ్ మీదుగా పెద్దఎల్కిచర్లకు చేరుకుంటుంది. అక్కడ సుంకరి కిష్టమ్మ కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం యాత్ర పెద్దఎల్కిచర్ల నుంచి కొందుర్గు మీదుగా మొగిలిగిద్ద నుంచి షాద్‌నగర్ మీదుగా గుండ్లపొట్లంపల్లికి చేరుకుంటుంది. అక్కడ ఆకుల శంకరయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం గుండ్లపొట్లంపల్లి నుంచి నందిగామ ద్వారా నర్సప్పగూడకు చేరుకొనిపెంటమీది ఆండాలు కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం నర్సప్పగూడ నుంచి చేగూర్ జెడ్పీరోడ్ కుమ్మరిగూడ మీదుగా మల్లాపూర్‌కు చేరుకొని అక్కడ పిన్నింటి నాగిరెడ్డి కుటుంబానికి పరామర్శిస్తారు.
Share this article :

0 comments: