
కొల్లాపూర్ మండలం పెంట్లవెల్లికి చెందిన వూరి లచ్చ మ్మ, ఆంజనేయులు దంపతులకు దివంగత సీఎం వైఎస్‌ఆర్ అంటే ఎనలేని అభిమానం. వైఎస్ మరణవార్త తెలిసిన నా టినుంచి లచ్చమ్మ నిద్రహారాలు మానేసింది. ఆయన చని పోతే ఇక తన వృద్ధాప్య పింఛన్ ఆగిపోతుందేమోనని తలుచుకుంటూ కుమిలి పోయింది. తమ వద్దకు వచ్చే వారికి మహానేత గురించి చెబుతుండేది. టీవీ చూస్తూ చూస్తూ గుండెపోటుతో కనుమూసింది. లచ్చమ్మ భర్త ఆంజనేయులుకు ఇప్పటికీ వైఎస్‌పై అభిమానం చూపుతారు.
కొత్తకోట మండలం రాయినిపేట గ్రామానికి చెందిన దస్తగిరమ్మ వైఎస్ అభిమాని. ఆయన ఇచ్చిన పింఛన్ ఎంతో మేలు కలిగించేదని భావించేది. మహానేత మరణంతో ఇక పింఛన్ రాదేమోనని దిగులు చెందింది. టీవీ చూస్తూనే హఠాన్మరణం పాలైంది. ఆమెకు నలుగురు కొడుకులు, కుమార్తె ఉన్నారు. అలాగే కొన్నూర్ గ్రామానికి చెందిన నాగమ్మ వికలాంగురాలు. అప్పట్లో ఆమె వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన వికలాంగులకు పింఛన్ పథకం ద్వారా లబ్ధిపొందేది. వైఎస్ మరణవార్త విని గుండెపోటుతో మరణించింది.
వనపర్తి మండలం చిట్యాలలో వైఎస్ మరణవార్త విని గుండెపోటుతో మృతి చెందిన గొల్ల మనెమ్మ కుటుంబాన్ని షర్మిల పరామర్శించనున్నారు. పాన్‌గల్ మండలం అన్నారం, దవాజిపల్లి స్టేజి, అంజనగిరి, మెట్‌పల్లి మీదుగా వనపర్తి నుంచి చిట్యాలకు చేరుకుని మనెమ్మ భర్త గొల్లబుచ్చన్న ఇంటికి వెళ్లి వారిని పరామర్శిస్తారు.
0 comments:
Post a Comment