పూటకో మాట.. రోజుకో విధానం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పూటకో మాట.. రోజుకో విధానం

పూటకో మాట.. రోజుకో విధానం

Written By news on Friday, December 5, 2014 | 12/05/2014


‘చంద్ర’మోసం
⇒ రుణమాఫీ హామీపై పూటకో మాట.. రోజుకో విధానం
⇒ పంట రుణాల మాఫీ లబ్ధిదారుల జాబితాలో సగానికిపైగా కోత
⇒ తొలిదశలో 1.98 లక్షల మంది రైతులకు మాత్రమే మాఫీ వర్తిస్తుందంటున్న బ్యాంకర్లు
⇒ ఉద్యానవన పంట రుణాలపై మాటమార్చిన చంద్రబాబు.. ఎకరానికి రూ.పది వేల వంతున మాఫీ
⇒ డ్వాక్రా రుణ మాఫీపై స్పష్టత ఇవ్వని సర్కారు.. సంఘంలో ఒక్కొక్కరికి రూ.పది వేల వంతున సహాయం
⇒ మాట మార్చడంతో ఆరు నెలల్లో రైతులపై రూ.939 కోట్లు,  మహిళలపై రూ.210 కోట్ల వడ్డీ భారం

సాక్షి ప్రతినిధి, తిరుపతి: రైతులు, మహిళలనూ సీఎం చంద్రబాబు నిలువునా మోసం చేశారు. వ్యవసాయ, డ్వాక్రా రుణాలు మాఫీ చేసి రైతులను, మహిళలనూ రుణ విముక్తులను చేస్తానని వాగ్దానం చేశారు. అధికారం చేపట్టాక పూటకో తిరకాసు. రోజుకో కొర్రీ వేస్తూ ఆ హామీని నీరుగార్చారు. రైతులకూ మహిళలకూ దన్నుగా, చంద్రబాబు మోసానికి నిరసనగా గత నెల 5న జిల్లా వ్యాప్తంగా 66 మండల కేంద్రాల్లోనూ ధర్నాలు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. శుక్రవారం చిత్తూరులో జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు ఉపక్రమించింది. మహిళలూ, రైతులు భారీ ఎత్తున చిత్తూరుకు కదలివచ్చి వైఎస్సార్‌సీపీ నేతృత్వంలో కదంతొక్కుతారన్న ఇంటెలిజెన్స్ నివేదికలు ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.

సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క సంతకంతో వ్యవసాయ రుణాలు, డ్వాక్రా రుణాలను మాఫీ చేసి అటు రైతులనూ ఇటు మహిళలను ఆదుకుంటామని చంద్రబాబు ఊరూవాడ ఊదరగొట్టారు. చంద్రబాబు మాటలను నమ్మిన రైతులు, మహిళలు టీడీపీకి అధికారం దక్కడానికి దోహదం చేశారని రాజకీయ పరిశీలకులు అప్పట్లో విశ్లేషించారు. రుణమాఫీ హామీ ఒక్కటే తమను అధికారపీఠంపై కూర్చోబెట్టిందని చంద్రబాబు సహా టీడీపీ నేతలు బాహాటంగా అంగీకరించారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసింది మొదలు రోజుకో మాట, పూటకో విధానంతో రుణమాఫీ హామీని నీరుగార్చేం దుకు చంద్రబాబు చేయని ప్రయత్నమంటూ లేదు.

ఇదిగో తిరకాసు.. అదిగో కోత..

చంద్రబాబు హామీ ఇచ్చిన మేరకు జిల్లాలో డిసెంబర్ 31, 2013 నాటికి 8,70,321 మంది రైతులు రూ.11,180.25 కోట్లు బ్యాంకులకు బకాయిపడ్డారు. ఒక్క సంతకంతో ఆ రుణాలను మాఫీ చేయాల్సిన చంద్రబాబు, తొలి సంతకంతోనూ రైతులను వంచించారు. రుణ మాఫీకి విధి విధానాలు రూపొందించడానికి కోటయ్య కమిటీని నియమిస్తూ జూన్ 8న చంద్రబాబు తొలి సంతకం చేశారు. చేశా రు. కోటయ్య కమిటీ నివేదిక మేరకు ఒక్కో రైతు కుటుంబానికి రూ.1.5 లక్షలు(రూ.లక్ష పంట రు ణం, రూ.50 వేలు బంగారు రుణం) మాఫీ చేస్తామ ని ప్రకటించారు.

ఆ మేరకు లబ్ధిదారుల జాబితాను రూపొందించడానికి ఆగస్టు 2 మార్గదర్శకాలు జారీచేశారు. 30 అంశాల ప్రాతిపదికగా చేసుకుని బ్యాంకర్లు లబ్ధిదారుల జాబితాను రూపొందించారు. ఆధార్‌కా ర్డు, రేషన్‌కార్డు, బ్యాంకు ఖాతా నంబర్, పట్టాదారు పాసుపుస్తకం, పంట సాగు వివరాలు, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణం ఇచ్చారా లేదా అన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని లబ్ధిదారుల జాబితాను రూపొందించాలని ఆదేశించారు.

స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణం తీసుకోని రైతులను అనర్హులుగా ప్రకటించాలని సూచించారు. ఈ తిరకాసులతో లబ్ధిదారుల జాబితాలో భారీగా కోత పడింది. 4.73 లక్షల మంది రైతులు మాత్రమే రుణ మాఫీకి అర్హులుగా బ్యాంకర్లు తేల్చారు. ఈ నివేదికను పరిశీలించిన ప్రభుత్వం ఆ జాబితాలో కూడా భారీగా కోత వేస్తూ గురువారం సీఎం చంద్రబాబు రుణ విముక్తి పథకం మార్గదర్శకాలు జారీచేశారు.
     
⇒ తొలుత రూ.50 వేల లోపు రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీని వర్తింపచేయాలని నిర్ణయించారు. ఈనెల 10 నుంచి జనవరి 14లోగా ఈ ప్రక్రియను పూర్తిచేయాలని నిర్దేశించారు. ఇందుకు సంబంధించిన లబ్ధిదారుల జాబితాను ఈనెల 6న ప్రకటిస్తామని సీఎం చెప్పారు.
⇒ రెండో విడత రూ.50 వేల కన్నా ఎక్కువ రుణం తీసుకున్న రైతులకు తొలుత రూ.50 వేలు.. తక్కిన మొత్తాన్ని నాలుగు విడతల్లో చెల్లించేలా రైతు సాధికార సంస్థ ద్వారా బాండ్లను జారీచేయాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియ జనవరి 22 నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు.
⇒ సీఎం జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం తొలి వి డత 1.98 లక్షల మంది రైతులకు మాత్రమే రుణ మాఫీ వర్తించే అవకాశం ఉందని బ్యాంకర్లు అం చనావేస్తున్నారు. రైతుసాధికార సంస్థకు రూ.ఐదు వేల కోట్లు కేటాయించిన నేపథ్యంలో ఆ రైతులకు కూడా రూ.50 వేల వంతున ఖాతాల్లో జమ చేయ డం సాధ్యం కాదని బ్యాంకర్లు చెబుతున్నారు.
⇒ ఉద్యానవన పంటల రైతుల రుణమాఫీని పరిశీలిస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఎకరానికి రూ.పది వేల వంతున మాఫీని వర్తింపజేస్తామని మాట మార్చడం గమనార్హం.
⇒ రుణమాఫీ అమలు ఆర్నెల్లు జాప్యం చేయడం వల్ల రైతులపై బ్యాంకులు 14 శాతం వడ్డీ విధించాయి. దీని వల్ల రైతులపై రూ.939.14 కోట్ల భారం పడింది. ఇప్పుడు ప్రభుత్వం తొలి విడత విడుదల చేసే మొత్తం వడ్డీకి కూడా సరిపోదని బ్యాంకర్లు తేల్చిచెబుతున్నారు.
 
డ్వాక్రా మహిళలకూ టోపీ..
జిల్లాలో 61,711 స్వయం సహాయక సంఘాల్లో 6.45 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. డిసెంబర్ 31, 2013 నాటికి 52,433 డ్వాక్రా సంఘాల మహిళలు  రూ.1,611.03 కోట్లను బ్యాంకులకు బకాయిపడ్డారు. చంద్రబాబు హామీ ఇచ్చిన మేరకు ఒక్క సంతకంతో ఆ రుణాలను మాఫీ చేయాలి. కానీ.. అధికారం చేపట్టగానే డ్వాక్రా రుణాలను మాఫీ చేయలేమని చేతులెత్తేశారు. ఒక్కో సంఘానికి రూ.లక్ష లేదా ఒక్కో మహిళకు రూ.పది వేల వంతున పెట్టుబడి నిధిగా అందిస్తామని మాట మార్చారు.

చంద్రబాబు రుణాలను మాఫీ చేస్తారనే ఆశతో ఆర్నెళ్లుగా డ్వాక్రా మహిళలు అప్పులను చెల్లించడం లేదు. దీనివల్ల ఆ మహిళలపై 14 శాతం వడ్డీని బ్యాంకర్లు వసూలు చేస్తున్నారు. దీని వల్ల మహిళలపై రూ.135.32 కోట్ల మేర వడ్డీ భారం పడింది. సకాలంలో రుణం చెల్లించిన మహిళలకు ప్రభుత్వం వడ్డీని రీయింబర్స్‌మెంట్ చేస్తుంది. మాఫీపై ఆశతో మహిళలు రుణాలను చెల్లించకపోవడంతో రూ.75 కోట్లకుపైగా వడ్డీ రాయితీని మహిళలు కోల్పోయారు. అంటే.. మహిళలపై రూ.210.32 కోట్ల భారం పడినట్లు స్పష్టమవుతోంది.

ఇక సీఎం చంద్రబాబు మార్గదర్శకాల మేరకు జిల్లాలో 54,930 సంఘాల్లోని మహిళలకు రూ.549 కోట్లను పెట్టుబడి నిధిగా అందించాలని డీఆర్డీఏ పీడీ రవిప్రకాష్‌రెడ్డి వారం రోజుల క్రితం ప్రతిపాదనలు పంపారు. రుణ విముక్తి పథకంలో డ్వాక్రా రుణాల ప్రస్తావనే లేకపోవడం గమనార్హం. డ్వాక్రా మహిళలకు రూ.పది వేల వంతున పెట్టుబడి నిధి ఎప్పుడు అందిస్తారన్నది అంతుచిక్కడం లేదు. చంద్రబాబు మోసానికి నిరసనగా రైతులు, మహిళలు రోడ్డెక్కుతున్నారు. మహిళలు, రైతులకూ వైఎస్సార్‌సీపీ బాసటగా నిలుస్తూ ప్రభుత్వం పోరాటాలు చేస్తోండడం చంద్రబాబుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
Share this article :

0 comments: