కరువులో ఏం చర్యలు చేపట్టారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కరువులో ఏం చర్యలు చేపట్టారు

కరువులో ఏం చర్యలు చేపట్టారు

Written By news on Wednesday, December 3, 2014 | 12/03/2014


కరువులో ఏం చర్యలు చేపట్టారు
 పార్లమెంట్‌లో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రశ్న
 
 సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రీయ కృషి వికాస్ యోజనలో భాగంగా అదనపు పశుగ్రాస ఉత్పత్తి పథకాన్ని దేశంలోని కరువు ప్రాంతాల్లో అమలు చేస్తున్నారా? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం పార్లమెంట్‌లో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రస్తావించారు. కృషి వికాస్ యోజనలో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చేపడుతున్న చర్యలు, ప్రస్తుత కరువు పరిస్థితుల్లో కేంద్రం తీసుకుంటున్న చర్యలను వివరించాలన్నారు. అలాగే నూనె గింజలు, తృణధాన్యాల  ఉత్పత్తులు పెంచేందుకు ఏం చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. క్రైస్తవ దళితులు సాంఘిక, ఆర్థిక, విద్యా తదితర విషయాల్లో ఎంతో వెనుకబడి ఉన్నారని, వారికి ప్రభుత్వం నుంచి అందాల్సిన ఫలాలు అందకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారని వివరించారు. ఇప్పటికైనా దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించి, అందరి మాదిరిగానే వారికి అవకాశాలు కల్పించాలని కోరారు. పొంగులేటి ప్రస్తావించిన వ్యవసాయ సంబంధిత ప్రశ్నలకు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి సంజీవ్‌కుమార్ బాల్యాన్ సమాధానమిస్తూ కరువు పరిస్థితులు ఏర్పడే సీజన్‌లోనే కృషి వికాస్ యోజనను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఈ సీజన్‌లో దేశం మొత్తం మీద వికాస్ యోజనకు రూ.100 కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఎలాంటి ప్రతిపాదనలు తమ వద్దకు రాలేదని వివరించారు.
Share this article :

0 comments: