పంటలు కాలిపోయిన గ్రామాల్లో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల పర్యటన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పంటలు కాలిపోయిన గ్రామాల్లో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల పర్యటన

పంటలు కాలిపోయిన గ్రామాల్లో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల పర్యటన

Written By news on Tuesday, December 30, 2014 | 12/30/2014


పంటలు కాలిపోయిన  గ్రామాల్లో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల పర్యటన
గుంటూరు: గుంటూరు జిల్లాలోని రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో కాలిపోయిన పంట పొలాలను వైఎస్ఆర్ సీపీ రాజధాని రైతుహక్కుల పరిరక్షణ కమిటీ పరిశీలించింది. తాడేపల్లి, తుళ్లూరు మండలాల్లోని ఆరు గ్రామాల్లో 13 చోట్ల పంట పొలాలు, తోటలు, షెడ్లు, వెదురుబొంగులు, డ్రిప్ పరికరాలను గుర్తు తెలియని దుండగులు ఆదివారం రాత్రి తగలబెట్టిన విషయం తెలిసిందే. తుళ్లూరు మండలం లింగాయపాలెం, ఉద్దండరాజుపాలెం, వెంకటపాలెం ఈ గ్రామాలలో కమిటీ పర్యటించింది. రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాధిత రైతులను కమిటీ సభ్యులు పరామర్శించారు.

రైతులకు అండగా ఉంటామని కమిటీ సభ్యులు రైతులకు హామీ ఇచ్చారు. దుండగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. ఈ గ్రామాలలో పర్యటించినవారిలో ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణా రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, గొట్టిపాటి రవి, ఉప్పులేటి కల్పన, వైఎస్ఆర్ సీపీ నేతలు నాగిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, మర్రి రాజశేఖర్,  క్రిస్టియానా తదితరులు ఉన్నారు. అనంతరం నేతలు మాట్లాడుతూ ఈ సంఘటనపై సీబిఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
Share this article :

0 comments: