Home »
» వైఎస్ జగన్ తో ఏపీ రాజధాని ప్రాంత రైతుల భేటీ
వైఎస్ జగన్ తో ఏపీ రాజధాని ప్రాంత రైతుల భేటీ
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని ఏపీ రాజధాని ప్రాతిపాదిత గ్రామాల రైతులు కలిశారు. గురువారం ఉదయం రైతులు జగన్ ను కలసి తమ సమస్యలను తెలియజేశారు. రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో భూములు సేకరిస్తోంది. ప్రభుత్వం బలవంతంగా తమ భూములు లాక్కునేందుకు ప్రయత్నిస్తోందని రైతులు జగన్ దృష్టికి తీసుకువచ్చారు. పొలాలు తీసుకుంటే వేలాది కుటుంబాలు రోడ్డున పడతాయని పెనుమాన, ఉండవల్లి గ్రామాల రైతులు చెప్పారు. ఈ విషయంపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. రైతులకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.
0 comments:
Post a Comment