
రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని షర్మిల అన్నారు. పెట్టుబడులు రాక రైతులు అప్పులపాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ అకస్మిక మరణాన్ని తట్టుకోలేక మృతి చెందినవారి కుటుంబాలను ఈ రో్జు షర్మిల పరామర్శించారు. పెద్ద ఎల్కచర్లలో ఎస్. కృష్ణమ్మ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. ఆ కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కిష్టమ్మ కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని షర్మిల హామీ ఇచ్చారు.
తన తల్లి కిష్టమ్మకు రాజశేఖరరెడ్డి అంటే అపారమైన గౌరవమని, తనకు ప్రతి నెలా పింఛన్ ఇచ్చి ఆదుకుంటున్నాడని తన తల్లి ఎంతో సంతోషించేదని కిష్టమ్మ కుమారుడు బాలయ్య ఈ సందర్బంగా షర్మిలకు వివరించాడు. వైఎస్ మరణవార్త విని తన తల్లి గుండెపోటుతో చనిపోయిందని బాలయ్య ఆవేదన చెందాడు. ఆ మహానేత కుమార్తె తమ ఇంటికి రావడం ఆనందంగా ఉందని అన్నారు.
0 comments:
Post a Comment