మహాధర్నాకు తరలివస్తున్న జనం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మహాధర్నాకు తరలివస్తున్న జనం

మహాధర్నాకు తరలివస్తున్న జనం

Written By news on Friday, December 5, 2014 | 12/05/2014


మహాధర్నాకు తరలివస్తున్న జనం
హైదరాబాద్: వైఎస్ఆర్ సీపీ చేపడుతున్న మహాధర్నాలో పాల్గొనేందుకు జనం పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అన్ని ప్రాంతాల నుంచి ఆయా జిల్లాల కలెక్టరేట్ల వద్దకు జనం చేరుకుంటున్నారు. రుణమాఫీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేడు మహాధర్నా చేపడుతున్న సంగతి తెలిసిందే.

ధర్నాలో పాల్గొనేందుకు వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు, రైతులు, మహిళలు, యువకులు, డ్వాక్రా సంఘాల వారు, చిన్నాపెద్దా తేడా లేకుండా అన్ని వర్గాల వారు తరలివస్తున్నారు. మహాధర్నాను అడ్డుకునేందుకు పోలీసులను భారీ సంఖ్యలో మోహరించినా జనం స్వచ్ఛంధంగా వస్తున్నారు. కొన్ని చోట్ల బైకు ర్యాలీలు నిర్వహించారు. విశాఖపట్నంలో జరిగే ధర్నాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొంటారు. వైఎస్ జగన్ శుక్రవారం ఉదయమే విశాఖకు చేరుకున్నారు.

టీడీపీ ప్రభుత్వం మోసపూరిత విధానాలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో నేడు చేపడుతున్న మహాధర్నాను భగ్నం చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధర్నాలో పాల్గొననున్న విశాఖపట్నంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు.

విశాఖ జిల్లాపరిషత్ నుంచి కలెక్టరేట్ కు వచ్చే మార్గంలో కార్యకర్తలు రాకుండా ముళ్లకంచె వేశారు. కలెక్టరేట్ ముందు కూడా ముళ్లకంచెలు ఏర్పాటు చేశారు. ఇతర జిల్లాల్లో కూడా మహాధర్నాను అడ్డుకునేందుకు పోలీసు బలగాలను భారీ సంఖ్యలో మోహరిస్తున్నారు. కాసేపట్లో విశాఖ కలెక్టరేట్ వద్ద జరిగే మహాధర్నాలో వైఎస్ జగన్ పాల్గొంటారు.


విశాఖ చేరుకున్న వైఎస్ జగన్
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ఉదయం విశాఖపట్నం వెళ్లారు. హైదరాబాద్ నుంచి బయల్దేరి విశాఖ చేరుకున్నారు. టీడీపీ ప్రభుత్వం మోసపూరిత విధానాలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేడు చేపడుతున్న మహాధర్నాలో వైఎస్ జగన్ పాల్గొంటారు.

ఉదయం 10గంటలకు ధర్నా నిర్వహించే కలెక్టరేట్‌కు వైఎస్ జగన్ చేరుకుంటారు. మధ్యాహ్నం 1 గంటవరకు ధర్నా నిర్వహిస్తారు. అనంతరం వై.ఎస్.జగన్ సర్క్యూట్ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. పార్టీ నేతలతో కొంతసేపు సమావేశమయ్యాక సాయంత్రం 5గంటలకు హైదరాబాద్ వెళతారు. ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఈ రోజు వైఎస్ఆర్ సీపీ ధర్నాలు చేపడుతున్న సంగతి తెలిసిందే.
Share this article :

0 comments: