
రుణమాఫీ అమలు చేయడంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనేది ఆనాయకులు చేపట్టిన రాస్తారోకోనే తేటతెల్లం చేస్తుందన్నారు. సాధ్యం కాని హామీలు ఇచ్చి అదికారం చేపట్టిన టీడీపీ వాటిని అమలు చేయలేక అధికారులపై నిందలు వేస్తూ రాస్తారోకో చేయడం వారికే చెల్లిందన్నారు. ఇకనైనా టీడీపీ నేతలు తమ అధినాయకుడు చంద్రబాబుపై ఒత్తిడి తీసుకురావాలని డాక్టరు దుట్టా హితవు పలికారు.
కుట్రలో భాగమే : ఏపీ రైతు సంఘం
రుణమాఫీ అమలులో అదికారులు సహకరించడం లేదంటూ వారిపై నెపం వేయడం అధికారపార్టీ నాయకులకు సరికాదని ఏపీ రైతు సంఘం బాపులపాడు మండల అధ్యక్షుడు అబ్ధుల్ భారీ హితవు పలికారు. ఏపీరైతు సంఘం నాయకులు పాటూరి శ్రీను, వంగపండు రామకృష్ణ, చలమయ్య తదితరులు రాస్తారోకోను ఖండించారు.
0 comments:
Post a Comment