విశాఖపట్నం: వైఎస్ఆర్ సీపీ పిలుపు ఇచ్చిన మహా ధర్నా సమయం దగ్గరపడేసరికి ఏపీ ప్రభుత్వంలో కలకలం మొదలైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల వాగ్ధానాలు గాలికి వదిలేసిన నేపధ్యంలో అందుకు నిరసరనగా వైఎస్ఆర్ సీపీ ఈ నెల 5న రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేయాలని పిలుపు ఇచ్చిన విషయం తెలిసింఏద. విశాఖ కలెక్టరేట్ వద్ద రేపు ఉదయం జరిగే ధర్నాలో పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ ధర్నా కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష మద్దతు లభిస్తుండటంతో దానికి అడ్డుతగలడానికి అధికారపార్టీ నేతలు ప్రయత్నాలు మొదలు పెట్టారు.
ప్రజలను ధర్నాకు హాజరుకాకుండా చేయాలని చూస్తున్నారు. వాహనాలపై ఆంక్షలు విధించారు. నిబంధనల పేరుతో అడ్డుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ధర్నాలో పాల్గొనవద్దని విశాఖ ప్రజలకు స్థానిక ఎమ్మెల్యే ఎస్ఎంఎస్ లు పంపుతున్నారు.
**

0 comments:
Post a Comment