చేసిన వాగ్దానం ఏంటి, ఇప్పుడు చేస్తున్నది ఏంటి? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చేసిన వాగ్దానం ఏంటి, ఇప్పుడు చేస్తున్నది ఏంటి?

చేసిన వాగ్దానం ఏంటి, ఇప్పుడు చేస్తున్నది ఏంటి?

Written By news on Monday, December 22, 2014 | 12/22/2014


రుణమాఫీపై చంద్రబాబు మాట తప్పారు: వైఎస్ జగన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రుణమాఫీ ప్రకటనపై మాటతప్పారని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. శాసనసభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ..  రైతులు, డ్వాక్రా మహిళల రుణాలన్నంటినీ మాఫీ చేస్తానని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తుచేశారు.

రుణమాఫీ ఫైలుపై తొలి సంతకం చేస్తానని అప్పట్లో చెప్పిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక నిబంధనల పేరిట కోత పెట్టారని విమర్శించారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్, గరిష్ట రుణమాఫీ పరిమితి పేరిట రైతులను మోసం చేశారని వైఎస్ జగన్ ఆరోపించారు. ఎన్నికల ముందు నిబంధనల గురించి ఎందుకు చెప్పలేదని సభలో నిలదీశారు. సభలో వైఎస్ జగన్ ఏమి మాట్లాడారంటే:
* రైతుల రుణాలపై ప్రభుత్వం చేసిన వాగ్దానం ఏంటి, ఇప్పుడు చేస్తున్నది ఏంటి?
* మార్చి 31వ తేదీ నాటికి రూ.87, 612 కోట్లు రైతు రుణాలున్నాయని, డ్వాక్రా రుణాలు రూ.14,204 కోట్లు ఉన్నాయని స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్ ఎల్ బీసీ).. ముఖ్యమంత్రి చంద్రబాబు  సమక్షంలో జరిగిన సమావేశంలో వెల్లడించింది.
* మొత్తంగా రూ.1.02 కోట్లు రుణాలు ఉన్నాయని స్పష్టం చేసింది.
* రైతులు రుణాలు చెల్లించడం లేదని ఎస్ ఎల్ బీసీ తెలిపింది.
* ప్రభుత్వం రుణాలు మాఫీ చేస్తుందని ఎదురు చూస్తున్నందున రుణాలు రెన్యువల్ కావని స్పష్టం చేసింది.
* వీరికి పంట బీమా కూడా రాదని ఎస్ ఎల్ బీసీ వెల్లడించింది.
* రుణాలు చెల్లించకపోవడంతో అపరాధ వడ్డీ కూడా పడుతుందని వివరించింది.
* ఖరీఫ్ సీజన్ లో వ్యవసాయానికి ఇచ్చే రుణాలు ప్రక్రియ పూర్తిగా ఆగిపోయిందని ఎస్ ఎల్ బీసీ వెల్లడించింది.
*184వ సమావేశంలోనే కాకుండా తదుపరి 185, 186వ ఎస్ ఎల్ బీసీ సమావేశాల్లో కూడా ఇలాంటి విషయాలు చెప్పారు.
*2014-15లో బ్యాంకులు పెట్టుకున్న రుణాలు లక్ష్యం రూ.56,019 కోట్లు
*2011-12లో బ్యాంకులు పెట్టుకున్న రుణాల లక్ష్యం రూ.31,877 కోట్లు, వాస్తవంగా ఇచ్చినవి రూ.35,611 కోట్లు
*2012-2013లో వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.35,654 కోట్లు, వాస్తవంగా ఇచ్చింది రూ.50,060 కోట్లు
*2013-14కు సంబంధించి టార్గెట్ రూ.47,017 కోట్లు కాగా వాస్తవంగా ఇచ్చింది రూ.49,774 కోట్లు.
Share this article :

0 comments: