పరామర్శ యాత్రకు బయల్దేరిన వైఎస్ షర్మిల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పరామర్శ యాత్రకు బయల్దేరిన వైఎస్ షర్మిల

పరామర్శ యాత్రకు బయల్దేరిన వైఎస్ షర్మిల

Written By ysrcongress on Monday, December 8, 2014 | 12/08/2014


పరామర్శ యాత్రకు బయల్దేరిన వైఎస్ షర్మిలవీడియోకి క్లిక్ చేయండి
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక  మరణించిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి సోదరి షర్మిల పరామర్శ యాత్రకు బయల్దేరారు. సోమవారం ఉదయం ఆమె లోటస్ పాండ్ నుంచి పాలమూరు జిల్లా బయల్దేరి వెళ్లారు. అంతకు ముందు వైఎస్ షర్మిల వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

అనంతరం సోదరుడు వైఎస్ జగన్, వైఎస్ విజయమ్మ ...షర్మిలతో కలిసి కారు వరకు  వచ్చారు. షర్మిలతో పాటు  తెలంగాణ వైఎస్ఆర్ సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పరామర్శ యాత్రకు బయల్దేరారు. ఈ సందర్భంగా లోటస్ పాండ్.. పార్టీ కార్యకర్తలు, అభిమానులతో నిండిపోయింది.

తెలంగాణలో తొలి విడతలో భాగంగా మహబూబ్‌నగర్  జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో 21 కుటుంబాలను షర్మిల పరామర్శించి, వారికి జగన్ అండగా ఉన్నారన్న భరోసా ఇవ్వనున్నారు. ఐదు రోజుల పాటు సాగే ఈ యాత్ర జిల్లాలోని 13 నియోజకవర్గాల మీదుగా 921కిలోమీటర్ల మేర సాగనుంది.

యాత్ర సాగుతుందిలా...
వైఎస్ షర్మిల హైదరాబాద్ నుంచి నేరుగా కల్వకుర్తి నియోజకవర్గానికి చేరుకుంటారు. మాడ్గుల మండలంలోని ఇర్విన్ గ్రామ పరిధిలోని రెడ్డిపురంలో వైఎస్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన జె.రాయపురెడ్డి కుటుంబాన్ని ఆమె పరామర్శిస్తారు. అక్కడ్నుంచి తలకొండపల్లి మండలం దేవుని పడకల్ గ్రామంలో తుమ్మల నర్సింహ కుటుంబాన్ని పరామర్శిస్తారు. తర్వాత అదే మండలంలోని వెల్జాలలో ఎస్.అంజమ్మ కుటుంబాన్ని పరామర్శించి కల్వకుర్తి చేరుకుంటారు.

అక్కడ వైఎస్ఆర్  విగ్రహాన్ని షర్మిల ఆవిష్కరిస్తారు. రాత్రి అక్కడే బస చేసి మరుసటి రోజు అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో పరామర్శ యాత్ర కొనసాగిస్తారు. 12వ తేదీ వరకు జిల్లాలో పరామర్శ యాత్ర, వైఎస్ఆర్  విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమాలు సాగుతాయి. 12న షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు మండలం మల్లాపూర్‌లో పరామర్శతో యాత్ర ముగుస్తుంది.
Share this article :

0 comments: