Home »
» భారీ జనసందోహం మధ్య వైఎస్ఆర్ సీపీ మహాధర్నా
భారీ జనసందోహం మధ్య వైఎస్ఆర్ సీపీ మహాధర్నా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మహాధర్నా ఆరంభమైంది. శుక్రవారం ఉదయం అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద మహాధర్నా చేపడుతున్నారు. విశాఖపట్నం కలెక్టరేట్ వద్ద జరుగుతున్న ధర్నాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. జనం భారీ ఎత్తున తరలివచ్చారు. ధర్నా అడ్డుకునేందుకు పోలీసులను పెద్ద ఎత్తున మోహరించినా ప్రజలు ఖాతరు చేయకుండా వచ్చారు. విశాఖపట్నం రోడ్లు జనసంద్రంగా మారాయి. టీడీపీ ప్రభుత్వం మోసపూరిత విధానాలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహాధర్నాకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.ధర్నాలో పాల్గొనేందుకు జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రాష్ట్రం నలుమూలలా అన్ని ప్రాంతాల నుంచి ఆయా జిల్లాల కలెక్టరేట్ల వద్దకు జనం చేరుకున్నారు. వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు, రైతులు, మహిళలు, యువకులు, డ్వాక్రా సంఘాల వారు తరలివచ్చారు. మహాధర్నాను అడ్డుకునేందుకు పోలీసులను భారీ సంఖ్యలో మోహరించినా జనం స్వచ్ఛంధంగా వచ్చారు. ప్రజలను అడ్డుకునేందుకు పోలీసులు దౌర్జన్యాలకు పాల్పడ్డారు. అయినా ప్రజలు ఖాతరు చేయకుండా చంద్రబాబు ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.
0 comments:
Post a Comment