ఇది ఆరంభమే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇది ఆరంభమే

ఇది ఆరంభమే

Written By news on Saturday, December 6, 2014 | 12/06/2014


* ఇది ఆరంభమే: జగన్‌మోహన్‌రెడ్డి
ఉత్తరాంధ్రలో హుద్‌హుద్ తుపాను బాధితులకు బాబు చేసింది సున్నానే
ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఒక్క రూపాయైనా విదల్చలేదు
రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. అవెక్కడ? అంటూ అవహేళన చేస్తున్నారు
మాటపై నిలబడలేని బాబుకు రాజకీయాల్లో కొనసాగే అర్హత లేదు

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:  ‘‘ఎన్నికల ముందు మేనిఫెస్టోలో హామీలతో ఊదరగొట్టిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చాక హామీలను తుంగలో తొక్కేస్తున్నారు. వ్యవసాయ రుణాలు మాఫీ కావాలంటే బాబు రావాలి అన్నారు. జాబు కావాలంటే బాబు రావాలి అని చెప్పారు. మంగళసూత్రాలు నిలవాలం టే బాబు రావాలన్నారు. టీవీల్లో ఒకటే ఊదరగొట్టారు. జాబు కావాలి అనే లక్షల మంది ఓట్లేశారు. లక్షల మంది పిల్లలు ఓట్లేశారు. రుణాలు మాఫీ కావాలని రైతులు ఓట్లేశారు. అక్కచెల్లెమ్మ లు ఓట్లేశారు. ఎన్నికలు అయిపోయాయి. అక్కచెల్లెమ్మలతో పనైపోయింది. రైతులతో పనైపోయింది. పిల్లలతో, చదువుకుంటున్న విద్యార్థులతో పనైపోయింది. అంతే బాబు అసలు రంగు బయటపడింది. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని గాలికొదిలేశారు’’ అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీరును, టీడీపీ ప్రభుత్వ వైఖరిని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తూర్పారబట్టారు.

రాష్ట్రంలో 87వేల కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలు ఉంటే చంద్రబాబు కేవలం రూ. 5 వేల కోట్లు విదిల్చి దబాయిస్తున్నారని.. రైతులకు కోటి పైచిలుకు బ్యాంకు అకౌంట్లు ఉంటే కేవలం 22 లక్షల మంది ని మాత్రమే లెక్కతేల్చారని దుయ్యబట్టారు. డ్వాక్రా రుణాలు రూ. 14 వేల కోట్లు ఉంటే.. వాటి మాఫీకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని గుర్తుచేశారు. ఇంటికి ఒక ఉద్యోగమిస్తానని చెప్పిన చంద్రబాబును తాను అసెంబ్లీలో అడిగితే.. గవర్నమెంటు ఉద్యోగాలు కాదు ప్రైవేటు ఉద్యోగాలు అంటూ ఆయన మాటమార్చారని మండిపడ్డారు. ‘‘చంద్రబాబు ప్రజలతో పని ఉన్నప్పుడు.. ప్రజల ఓట్లు కావల్సినప్పుడు.. తాను సీఎం కుర్చీలో కుర్చోవాలనుకున్నప్పుడు ఒక మాట చెప్తారు. ఎన్నికలు అయిపోయాక ప్రజలతో పని తీరిపోయాక ఓట్లు వచ్చేశాక చంద్రబాబు మరో మాట చెప్తారు. బాకై్సట్ తవ్వకాలు అయినా పీసీపీఐఆర్ అయినా చంద్రబాబు ఎన్నికలకు ముందు చెప్పింది ఒకటి.. ఇప్పుడు చేసేది మరొకటి’’ అంటూ విరుచుకుపడ్డారు.

‘‘ఎన్నికల హామీలను తుంగలో తొక్కేసిన టీడీపీ పాలనకు వ్యతిరేకంగా చేపట్టిన పోరాటానికి ఇది ఆరం భం మాత్రమే.. చంద్రబాబు తన హామీలను నెరవేర్చేకపోతే జనవరి 6, 7 తేదీల్లో నేనే నిరాహారదీక్ష చేస్తా. ఈ పోరాటం ఇంతటితో ఆగదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 86 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే.. ఆత్మహత్యలు ఎక్కడ జరిగా యి ఎప్పుడు జరిగాయని ఆయన హేళనగా ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబుకు గట్టిగా బుద్ధి వచ్చేలా చెప్తున్నా.. ఆత్మహత్యలు చేసుకున్న ఆ 86 మంది రైతుల కుటుంబాలను వాళ్ల ప్రతి ఇంటికి వెళ్లి పరామర్శిస్తాను. సంక్రాంతి పండుగ తరువాత వాళ్ల ప్రతి ఇంటికి వెళ్లి ఓదారుస్తాను. అప్పటికైనా చంద్రబాబుకు అర్థమవుతుంది’’ అని వై.ఎస్.జగన్ ప్రకటించారు.

ఎన్నికల హామీలను నెరవేర్చని చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ.. ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించింది. విశాఖ కలెక్టరేట్ వద్ద నిర్వహించిన మహాధర్నాలో జగన్ పాల్గొన్నారు. ఈ ధర్నాలో ఆయన ప్రసంగిస్తూ.. చంద్రబాబు ఎన్నికల హామీలను ఎలా తుంగలో తొక్కేసిందీ గణాంకాలతో వివరించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...

ప్రజలతో పనైపోయాక హామీలు తుంగలో తొక్కారు...
‘‘ఇన్ని వేల మంది రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ కదలివచ్చి నడిరోడ్డు మీద ధర్నాలు చేస్తున్నారు. కారణమేమిటని ఆలోచించే పరిస్థితిలో ఈ నాయకులు, పాలకులు లేరు. ఎన్నికల ముందు ఏ హామీలు ఇచ్చారు? ప్రజలతో పని ఉన్నప్పుడు ఏ మాటలు మాట్లాడారు? ప్రజలతో పని అయిపోయాక ఏం మాట్లాడుతున్నారు? అనేది ఒక్కసారి గుండెల మీద చేయివేసుకుని గుర్తుచేసుకొని చెప్పాలని ఈ నాయకులను, ఈ పాలకులను ప్రశ్నిస్తున్నాను. ఎన్నికలకు ముందు ఆ వేళ ఇదే చంద్రబాబు ఢిల్లీ వెళ్లి రాష్ట్రాన్ని విడగొట్టి హైదరాబాద్‌కు వచ్చాడు. మేమే రాష్ట్రాన్ని విడగొట్టామని ఢిల్లీలో చెప్పి ఎంపీలతో చేతులు పెకైత్తించారు. హైదరాబాద్ వచ్చిన తరువాత ఎన్నికల వస్తున్నాయి కదాని రెండు మేనిఫెస్టోలు విడుదల చేశాడు. సీమాంధ్ర మేనిఫెస్టో అని చెప్పి బుక్ పైకి ఎత్తారు. తెలంగాణ మానిఫెస్టో అని చెప్పి ఇలా బుక్కు పెకైత్తారు. బుక్ పేపర్లు తిరగేస్తే అందులో ఊదరగొటే హామీలే ఉన్నాయి. వస్తూనే మొట్టమొదటి సంతకం వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తున్నానని చెప్పి ఊదరగొట్టారు.

రెండో సంతకం డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానని చెప్పారు. ‘జాబు కావాలంటే బాబు రావాలి. మంగళసూత్రాలు నిలవాలంటే బాబు రావాలి. రైతులకు రుణాలు మాఫీ కావాలంటే బాబు రావాలి’ అని టీవీల్లో ఊదరగొట్టారు. బాబు రావాలి జాబు కావాలి అనే లక్షల మంది ఓట్లేశారు. బాబు రావాలి రైతుల రుణాలు మాఫీ కావాలని రైతులు ఓట్లేశారు. లక్షల మంది పిల్లలు ఓట్లేశారు. లక్షల మంది అక్కచెల్లెమ్మలు ఓట్లేశారు. ఎన్నికలు అయిపోయాయి. అక్కచెల్లెమ్మలతో పనైపోయింది. రైతులతో పనైపోయింది. పిల్లలతో, చదువుకుంటున్న విద్యార్థులతో పనైపోయింది. అంతే బాబు అసలు రంగు బయటపడింది. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని గాలికొదిలేశారు.

రైతు రుణాలపైనా, ఖాతాల లెక్క పైనా ప్లేటు ఫిరాయింపే...
ఎన్నికలకు ముందు చంద్రబాబుకు తెలుసు.. రైతుల రుణాలు రూ.87 వేల కోట్ల ఉన్నాయని తెలుసు. జగన్‌మోహన్‌రెడ్డికి తెలు సు. రాష్ట్రంలో చదువుకున్న ప్రతి ఒక్కరికీ తెలుసు. అందరికీ తెలు సు. ఇవాళ 87 వేల కోట్ల రూపాయల రైతు రుణాలకు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ఏమంటున్నారో తెలుసా..? ‘నేనెప్పుడు చెప్పాను రైతుల వ్యవసాయ రుణాలని? నేను క్రాప్ రుణాలని చెప్పాను’ అని మళ్లీ రుణాల విషయంలో ప్లేటు ఫిరాయిం చారు. మరోవైపు 87 వేల కోట్ల రుణాలకు గాను రాష్ట్రంలో దాదాపు కోటి పైచిలుకు రైతుల అకౌంట్లు ఉన్నాయి.

మొన్న చంద్రబాబు ప్రెస్‌మీట్ పెట్టి 22 లక్షల మంది రైతులు అని తేల్చేశారు. అదికూ డా.. ఇవాళ విశాఖపట్నానికి జగన్ వస్తున్నాడు.. రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు జరుగుతున్నాయని.. ఆయన ప్రెస్‌మీట్ పెట్టి ఏదో చేస్తున్నట్లు చెప్పారు. కోటి పైచిలుకు అకౌంట్లు ఉంటే కేవలం 22 లక్షల మందికి మాత్రమే అలా బిస్కట్లు వేసినట్లుగా కాస్తో కూస్తో ఇస్తానంటున్నారు. ఆ 22 లక్షల మంది రైతులకయినా ఎంత ఇస్తారో అంటే.. ‘అది మాత్రం నన్ను అడగొద్దు ఇప్పుడు చెప్పను’ అంటా రు. ఎంత ఇస్తారో చెప్పరు. ఎంత మందికి ఇస్తారో చెప్పరు. కానీ రోజూ బుకాయిస్తూ పోతారు. ఇలా చంద్రబాబు కోటి పైచిలుకు రైతులకు సంబంధించిన రూ. 87 వేల కోట్ల రుణాల సంగతిని పక్కనపెట్టేశారు.

నమ్మినందుకు రూ. 14 వేల కోట్ల అపరాధ వడ్డీ భారం...
డ్వాక్రా అక్కచెల్లమ్మలకు మాత్రం దాదాపు రూ. 14 వేల కోట్ల రుణాలు ఉన్నాయి. ఆ రూ. 14 వేల కోట్లు మాఫీ అవుతాయని డ్వాక్రా అక్కచెల్లమ్మలు కోటి ఆశలతో ఎదురుచూశారు. ఈ రూ. 14 వేల కోట్లు.. రైతులకు సంబంధించి రూ. 87 వేల కోట్లు కలిపితే లక్షా ఒక్కవేల కోట్ల అప్పులున్నాయి. ఈ డ్వాక్రా అక్కచెల్లమ్మలకు, రైతులకు ఎన్నికల వేళ పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పిన పెద్దమనిషి మాటలు నమ్మి అప్పులు కట్టనందుకు అపరాధ వడ్డీ రూ. 14 వేల కోట్లు కడుతున్నారు. ఈ లక్ష కోట్ల అప్పు మీద ఒక్క అపరాధ వడ్డీ భారమే 14 వేల కోట్ల రూపాయలు అయితే.. చంద్రబాబు కేవలం ఐదు వేల కోట్లు మాత్రమే కేటాయించి ‘20 శాతం మాఫీ అయిపోయింది’ అని చెప్తున్నాడు. మాట మీద నిలబడని ఇటువంటి పెద్దమనిషి రాజకీయాల్లో ఉండే అర్హత ఉందా? అని చంద్రబాబును అడుగుతున్నాను.

ప్రయివేటు ఉద్యోగాలైతే నీతో పనేమిటి బాబూ?
‘ప్రతి పిల్లాడికి ఉద్యోగమిస్తాను. నాకు 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. నాకు దేశానికి ట్యూషన్లు చెప్పిన అనుభవం ఉంది. నాకు ప్రపంచానికి ట్యూషన్లు చెప్పిన అనుభవం ఉంది’ అని ఎన్నికల ముందు చంద్రబాబు ఊదరగొట్టారు. ఒకవేళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకపోతే ప్రతి ఇంటికి రెండు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చాలెంజ్ చేశాడు. ఇవాళ రాష్ట్రంలో కోటి 75 లక్షల ఇళ్లున్నాయి. కోటి 75 లక్షల ఇళ్లకు రెండు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఎప్పుడిస్తావని చంద్రబాబును కాలర్ పట్టుకుని నిలదీయడానికి పిల్లలు ఎదురుచూస్తున్నారు. ఇదే చంద్రబాబును అసెంబ్లీలో గట్టిగా నిలదీస్తే ఆయన నిస్సిగ్గుగా అంటాడు.. ‘గవర్నమెంటు ఉద్యోగాలు ఇస్తానని నేను ఎప్పుడు చెప్పాను?’ అని అంటాడు. బాధనిపించింది. చంద్రబాబును అడిగాను అయ్యా గవర్నమెంటు ఉద్యోగాలు అయితే నీతో పని. ప్రైవేటు ఉద్యోగాలు అయితే నీతో పనేందయ్యా? ప్రైవేటు వ్యక్తుల దగ్గరకు పోవాలి కదా? అన్నాను. ఇలా పూటకొక మాట రోజుకొక అబద్ధం చెప్తున్నాడు.

అవ్వాతాతల జీవితాలతో చెలగాటమాడుతున్నారు...
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజున రాష్ట్రంలో 43,11,686 పెన్షన్లు ఉన్నాయి. ఆ పెన్షన్లు తీసుకునే అవ్వాతాతలకు ఆ డబ్బులు రాకపోతే కడుపునిండా అన్నం తినడానికి కూడా ఇబ్బందిపడే పరిస్థితి. అలాంటి అవ్వాతాతల జీవితాలతో చంద్రబాబు చెలగాటమాడుతున్నాడు. పెన్షన్ వెయ్యి రూపాయలు ఇస్తామన్నాడు. ముఖ్యమంత్రి అయ్యేనాటికి ఉన్న 43,11,686 పెన్షన్లకు వెయ్యి రూపాయలు అంటే నెలకు 431 కోట్ల రూపాయలు. అక్టోబరు ఒకటి నుంచి ఇస్తామన్నాడు. అంటే వచ్చే ఏడాది ఏప్రిల్ వరకూ లెక్కేస్తే ఏడు నెలలు. ఏడు నెలలకు 431 కోటి రూపాయలు చొప్పున మూడు వేల కోట్ల రూపాయలు.

అక్టోబర్‌కు ముందున్న ఐదు నెలలకు ఇప్పుడు ఇస్తున్న 200 పెన్షన్ ప్రకారం నెలకు రూ. 130 కోట్లు చొప్పున 650 కోట్లు. రెండూ కలిపితే 3,700 కోట్లు. అవ్వాతాతల కోసం నిజంగా కత్తిరింపులు లేకుండా ఇస్తున్న పెన్షన్లు. కొత్త పెన్షన్ల గురించి నేను మాట్లాడటం లేదు సుమా. ఉన్న పెన్షన్లకు బడ్జెట్‌లో రూ. 3,700 కోట్లు బడ్జెట్‌లో కేటాయించాల్సి ఉంటే.. ఈ పెద్ద మనిషి బడ్జెట్‌లో కేవలం రూ. 1,350 కోట్లు మాత్రమే  కేటాయించి.. మిగతా రూ. 2,400 కోట్ల మేర పెన్షన్‌దార్లను కత్తిరించడానికి సిద్ధపడ్డాడు. ఈ అవ్వాతాతలకు ఇస్తున్న పెన్షన్లపై కమిటీలు వేశాడు. ఆ కమిటీలలో ఉన్నదంతా టీడీపీకి చెందిన కార్యకర్తలు. వాళ్లు కత్తిరింపులకే ఉన్నారు అన్న రీతిలో వ్యవహరించారు. ఇటువంటి దారుణమైన పరిపాలన సాగుతోంది.

రీయింబర్స్‌మెంట్‌కు ఒక్క రూపాయీ ఇవ్వలేదు...
ఇవాళ చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అని చెప్పి ఆ దివంగత నేత రాజశేఖరరెడ్డి.. ప్రతి పిల్లాడిని గొప్ప గా చదివించాలి, చదువుల కోసం పేదరికం అడ్డురాకూడదు, ప్రతి పిల్లాడు ఇంజినీరు కావాలి, డాక్టర్ కావాలి అని.. ఆ దివంగత నేత కలలు కన్నాడు. ఆ నేత మన మధ్య నుంచి వెళ్లిపోయాడు. ఇవాళ చంద్రబాబు వచ్చాడు. ఫీజు రీయింబర్స్‌మెంటుకు సంబంధించి ఈ సంవత్సరం 2,400 కోట్ల రూపాయలు కావల్సి వస్తే.. ఇంతవరకూ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఈ సంవత్సరానికి చెందిన రూ. 2,400 కోట్లు పక్కనపెట్టండి. నిరుటి సంవత్సరం బకాయిలూ చంద్రబాబు ఇంతవరకు తీర్చలేదు. ఇలా ప్రతి విషయంలోనూ చంద్రబాబు ఎన్నికలకు ముందు ఒక మాట మాట్లాడారు. ఎన్నికలు అయిపోయాక ప్రజలతో పని అయిపోయాక మరో మాదిరిగా చేస్తున్నారు. ఇవాళ అందుకనే ధర్నా కార్యక్రమాలు చేస్తున్నాము. నవంబర్ 5న ప్రతి మండల కేంద్రంలోనూ ధర్నాలు చేశాం. దాని కొనసాగింపులో భాగంగా ఇవాళ డిసెంబర్ 5వ తారీఖున జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేస్తున్నాం.

కుక్కలకు వేసినట్లు పొట్లాలు వేయడమే తుపాను సాయమా?
విశాఖలో, ఉత్తరాంధ్రలో హుద్‌హుద్ తుపాను వచ్చింది. ఆ తుపా ను వచ్చినప్పుడు 10 రోజుల పాటు ప్రతి ప్రాంతంలోనూ తిరి గాను. ఆ ప్రాంతాలకు వెళ్లినప్పుడు భయానకమైన వాతావరణం కనిపించింది.బాబు ఏమైనా చేశారా అని అడిగాను. చంద్రబాబు ఏం చేశారంటే.. ఇలా ఒక వ్యాన్ కాలనీలోకి వచ్చేది ఒక కాలనీలో దాదాపు వెయ్యి మంది నివాసం ఉంటారు. ఆ కాలనీ లోకి ఎప్పు డు వచ్చిందో తెలియదుగానీ ఒక వ్యాన్ వస్తుంది. ఆ వ్యాన్‌లో పులిహోర పొట్లాలు, పాలప్యాకెట్లు ఉండేటివి. వెయ్యి మంది నివాసం ఉంటా ఉంటే ఆ వ్యాన్‌లో మాత్రం కేవలం 200 300 మందికి సరిపోయే పొట్లాలు ఉంటాయి. ఆ పోట్లాలు విసిరేసేవారు. ఇలా ఇలా కుక్కలకు విసిరేసినట్లు విసిరేసేవారు. చూసినప్పుడు బాధ అనిపించింది. నిజంగా నీకు మానవత్వం ఉంటే ఎం దుకు ప్రతి ఇంటికి వెళ్లి తలుపుకొట్టి మరీ ‘నేను ఈ సహాయం చేస్తున్నాను’అని చెప్పి ఆ పాలప్యాకట్లో ఆ బిరియానీ ప్యాకట్లో వాళ్ల ఇం టి దగ్గరకు వెళ్లి ఎందుకు ఇవ్వలేకపోయారు? అని అడుగుతున్నా.

 పాతిక రూకలిచ్చి చేతులు దులుపుకున్నారు
ఇదే చంద్రబాబు ఆ రోజు హుద్‌హుద్ తుపాను వచ్చినప్పుడు ఇక్కడే ఉండి చేసిందేమిటంటే.. సున్నా. ఇక్కడే తాను ఉన్నాడు. ఇక్కడే ఊదరగొట్టాడు తుపాను గురించి. ఎక్కడంటే అక్కడ మాట్లాడుతూ పోయాడు. అంత చేశాను ఇంత చేశాను అని చెప్పాడు. ఇవాళ నేను అడుగుతున్నాను. చంద్రబాబు చేసిందేమిటి? మామూలుగా ప్రతి నెల కేజీ రేషన్ బియ్యం రూపాయికి కొనుక్కునేవాళ్లం. 20 కేజీల బియ్యం 20 రూపాయలకు వచ్చేవి. ఈ చంద్రబాబు చేసిందేమిటంటే ఆ 20 రూపాయలు డిస్కౌంటు ఇచ్చి 25 కేజీల బియ్యం మాత్రం రేషన్ ఇచ్చాడు. అంతకన్నా ఎక్కువ ఒక్క పైసా చేయలేదు. ఇదీ ఈ పెద్ద మనిషి చేసింది.

మత్స్యకారులకైతే  50 రూపాయాలు ఇచ్చాడు. మిగిలిన వారికి 25 రూపాయలు ఇచ్చాడు. ఇదీ ఈ పెద్దమనిషి చేసింది. తుపాను వచ్చినప్పుడు ఇళ్లు నాశనమైపోయాయి. ప్రతి ఇంటి వాళ్లకు కనీసం బతకడానికి పని లేదు. తినడానికి తిండి లేదు. వారం రోజులు రెండు వారాల పాటు ఎలా బతకాలో అర్థం కాని పరిస్థితుల్లో బతికారు. పొలాలకు పోవాలన్నా పనులు చేసుకోవాలన్నా కరెంటు లేదు. అటువంటి పరిస్థితిలో వాళ్లను ఆదుకునేందుకు ప్రతి ఇంటికి ఐదు వేల రూపాయలు ఇవ్వండయ్యా అంటే.. ‘నేను ఇవ్వను పో’ అన్నారు ఇదే చంద్రబాబు. తుపాను వచ్చినప్పుడు ఉత్తరాంధ్ర జిల్లాలో దాదాపు 3 లక్షల ఇళ్లు దెబ్బతిన్నాయి. చంద్రబాబు ఇంతవరకూ ఏమైనా ఇచ్చారా? అని అడుగుతున్నాను (దీనికి జనం స్పందిస్తూ ‘లేదు లేదు’ అని గట్టిగా చెప్పారు).

పంట నష్టానికి ఒక్క రూపాయి ఇచ్చారా?
హుద్‌హుద్ తుపాను వల్ల 5 లక్షల 94 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఈ చంద్రబాబు మాటలు నమ్మి రుణాలు కట్టొద్దంటే కట్టని కారణంగా పంటల బీమా కూడా రాని పరిస్థితిలో రైతులు ఉన్నారు. ఈ 5 లక్షల 94 వేల ఎకరాల్లో రైతులకు చంద్రబాబు కనీసం రూపాయి అయినా ఇచ్చారా? అని అడుగుతున్నాను (లేదు లేదు అని జనం గట్టిగా చెప్పారు. ‘రెండు చేతులు పెకైత్తి గట్టిగా చెప్పాలి’ అని జగన్ కోరినప్పుడు జనం మరింత గట్టిగా ‘లేదు ఇవ్వలేదు’ అని బదులిచ్చారు).  

దెబ్బతిన్న బోట్లకు ఒక్క రూపాయి ఇచ్చారా?
హుద్‌హుద్ తుపాను వచ్చినప్పుడు ఇదే చంద్రబాబు వచ్చారు. హార్బర్ ప్రాంతం నాకూ గుర్తింది. అక్కడ 400 బోట్లు పోయాయి. 64 బోట్లు పూర్తిగా మునిగిపోయాయి. ఇదే చంద్రబాబు ఏమైనా బోట్లకు రూపాయి అని ఇచ్చారా? అని అడుగుతున్నాను (లేదు లేదు అని జనం గట్టిగా బదులిచ్చారు). ఏమీ ఇవ్వలేదు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో దాదాపుగా మూడు నాలుగు వేల ఫైబర్ బోట్లు పోయాయి. మోటారు బోటు ఒకొక్కటి రూ.4 లక్షలు. సోనా బోటు అయితే ఒక్కొక్క బోటు 30 లక్షల రూపాయలు. ఫైబర్ బోట్లు అయితే ఒక్కొక్క బోటు 3 - 4 లక్షలు రూపాయలు. వల ఒక్కొక్కటి లక్ష రూపాయలు. వాళ్ల కోసం ఇదే చంద్రబాబు ఏమైనా చేశారా? అని అడుగుతున్నాను (లేదు లేదు అని జనం బిగ్గరగా అరిచారు). ఒక్కటంటే ఒక్కటీ చేయలేదు.

బాబు మెడలు వంచేవరకూ పోరాటం...
ప్రతి విషయంలోనూ చంద్రబాబు ఎన్నికలప్పుడు ఒకమాట చెప్తారు. ఎన్నికలు అయిపోయిన తరువాత మరో మాట చెప్తారు. చంద్రబాబును కడిగేయడానికి.. రాబోయే రోజుల్లో చంద్రబాబు మెడలు వంచేందుకు.. జగన్‌కు తోడుగా మీ అందరి సహాయసహకారాలు కావాలని కోరుతున్నా. ఇందులో భాగంగా ఇవాళ ఇక్కడ జరుగుతున్న దారుణాల గురించి, హుద్‌హుద్ తుపాను నష్టాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నల గురించి డ్వాక్రా అక్కచెల్లమ్మల గురించి అవ్వాతాతల పెన్షన్ల గురించి చదువుకున్న పిల్లలు గురించి కలెక్టర్ దగ్గరకు వెళ్లి అర్జీ ఇస్తాం. ఇవాళ మొట్టమొదటి అర్జీ ఇది. ఇది చివరి అర్జీ కాదు. ఈ ప్రభుత్వం మీద పోరాటం ఇంతటితో మొదలవుతుందని చంద్రబాబును హెచ్చరిస్తున్నా.’’

సంక్రాంతి తర్వాత ఆ రైతు కుటుంబాలను పరామర్శిస్తా
‘‘ఈ పోరాటం ఇంతటితో ఆగిపోదు. జనవరి 6, 7 తేదీల్లో నేనే నిరాహారదీక్ష చేస్తూ ఈ పోరాటాన్ని కొనసాగిస్తాను. ఇంతటితో కూడా పోరాటం ఆగిపోదు. ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయి ఇప్పటికే 86 మంది రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ 86 మంది రైతుల ఆత్మహత్యల గురించి ప్రశ్నిస్తే.. ‘ఎప్పుడు జరిగాయి? ఎక్కడ జరిగాయి? అని చంద్రబాబు బుకాయిస్తున్నారు. రైతుల జీవితాలను అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారు.

చంద్రబాబుకు గట్టిగా బుద్ధి వచ్చేలా చెప్తున్నా.. ఆ 86 మంది ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను సంక్రాంతి పండుగ తరువాత వాళ్ల ప్రతి ఇంటికి వెళ్లి పరామర్శిస్తాను. వాళ్ల ప్రతి ఇంటికి వెళ్లి ఓదారుస్తాను. జగన్‌మోహన్‌రెడ్డి చూపిస్తాడు నీ పాలనలో ఎంతమంది రైతులు చనిపోయారనేది. అప్పటికైనా చంద్రబాబుకు అర్థమవుతుంది రైతుల జీవితాలతో చెలగాటాలాడకూడదని. డ్వాక్రా అక్కచెల్లమ్మల జీవితాలతో చెలగాటాలాడకూడదని. చదువుకుంటున్న పిల్లల జీవితాలతో చెలగాటాలు ఆడకూడదని. అవ్వాతాతల జీవితాలతో చెలగాటాలు ఆడకూడదని. అప్పటికైనా చంద్రబాబుకు అర్థమవుతుంది.’’

బాకై్సట్ మైన్ల రద్దు మాట ఏమైంది.. బాబూ?
ప్రతి విషయంలోనూ చంద్రబాబు ఎన్నికలప్పుడు ఒకటి చెబుతారు. ఎన్నికలు అయిపోయాక ఇంకొకటి  చేస్తారు. ఇదే చంద్రబాబు విశాఖ జిల్లాలో బాకై్సట్ మైన్ల గురించి ఆ రోజు ఎన్నికలప్పుడు ఏం చెప్పారు? ‘బాకై్సట్ మైన్లను రద్దు చేస్తాను’ అని చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తున్నారు? ఇదే బాకై్సట్ మైన్ల కోసం పారిశ్రామికవేత్తల కోసం రెడ్ కార్పెట్ వేసి.. ఇచ్చిన మాటను గాలికొదిలేస్తున్నారు.

నాడు భూమి అడిగితే చెట్టుకు కట్టేసి కొట్టమన్నారుగా?
ఇదే చంద్రబాబు పాయకరావుపేట నియోజకవర్గానకి వెళ్లినప్పుడు ‘పీసీపీఐఆర్ ప్రాజెక్టుకు సంబంధించి భూ సేకరణ జరుగుతుందా? ఎవరైనా అధికారులు వస్తే చెట్టుకు కట్టేసి కొట్టండి’ అని పిలుపునిచ్చారు. ఇవాళ అదే పీసీపీఐఆర్ భూములకు సంబంధించి చంద్రబాబు ఏమంటున్నారంటే.. ‘భూములు ఇవ్వాలి. ఇవ్వకపోతే బలవంతంగా అయినా తీసుకుంటాం’ అని చెప్తున్నారు.

2రోజుల్లో రద్దు చేస్తానన్న ప్లాంటును రెట్టింపు చేశారు
ఇదే చంద్రబాబు  శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికలప్పుడు సోంపేటకు వెళ్లి.. ‘నేను రెండ్రోజుల్లో ఇక్కడ పవర్ ప్లాంటు జీవోను క్యాన్సిల్ చేస్తాను’ అన్నారు. ఎన్నికలు అయిపోయిన తరువాత అదే సోంపేటకు 4 కిలోమీటర్ల దూరంలోనే ఆ రోజు 2,400 మెగావాట్ల ప్లాంటు ఉంటే ఇవాళ 4,000 మెగావాట్ల ప్లాంట్ కోసం జపాన్‌తో ఒప్పందం కుదుర్చుకుని వచ్చారు.
Share this article :

0 comments: