మహబూబ్ నగర్: పార్టీ ఆదేశిస్తే ఎటువంటి కార్యక్రమాలైనా చేస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల చెప్పారు. జిల్లాలో పరామర్శ యాత్రకు బయలుదేరిన షర్మిల మాడ్గుల మండలం ఇర్విన్ గ్రామ పరిధిలోని రెడ్డిపురం చేరుకున్నారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తట్టుకోలేక ప్రాణాలు వదిలిన రాయపురెడ్డి కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. వైఎస్ఆర్ పాలనలో రుణమాఫీ కావడంతో వ్యవసాయాన్ని పండగలా భావించాడు రాయపురెడ్డి. దీంతో వైఎస్ఆర్‌పై గుండెల నిండా అభిమానం నింపుకున్నాడు. ఇంతలోనే మహానేత వైఎస్ఆర్ మరణవార్తను తట్టుకోలేక రాయపురెడ్డి గుండె పగిలి చనిపోయాడు.
రాయపురెడ్డి మరణంతో కుమారుడి చదువు మధ్యలోనే ఆగింది. ఆర్థికంగా ఎన్నో కష్టాలను ఆ కుటుంబం ఎదుర్కొంది. ఇటువంటి పరిస్థితుల మధ్య మహబూబ్‌నగర్ జిల్లా రెడ్డిపురంలో రాయపురెడ్డి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు షర్మిల ధైర్యం చెప్పారు. తమ కుటుంబం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఆ తరువాత షర్మిల మాట్లాడుతూ తెలంగాణలో పార్టీ బలోపేతం చేస్తామని చెప్పారు. రైతుల ఆత్మహత్యలపై మాట్లాడటంలేదని కొందరు విమర్శలు చేస్తున్నారని, అయితే తమ పార్టీ సభ్యులు పార్లమెంటులో ఈ విషయం మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. తాను అన్ని ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉంటానని షర్మిల చెప్పారు.

0 comments:
Post a Comment