Home »
» నేడు తిరుపతికి వైఎస్ జగన్
నేడు తిరుపతికి వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తిరుపతికి వస్తున్నారు. తిరుపతిలో పీఎల్‌ఆర్ కన్వెన్షన్‌హాల్‌లో ప్రవాస భారతీయుడు చెన్నారెడ్డి కూతురు వివాహ రిసెప్షన్‌లో పాల్గొని.. పులివెందులకు బయలుదేరి వెళ్లనున్నారు. వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం మ ధ్యాహ్నం మూడు గంటలకు స్పైస్ జెట్ విమానంలో హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు.అక్కడి నుంచి పద్మావతి అతిథిగృహానికి చేరుకుని.. వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నేతలతో సమావేశమవుతారు. రాత్రి ఏడు గంటలకు పీఎల్‌ఆర్ కన్వెన్షన్ హాల్‌లో వివాహ రిసెప్షన్‌లో పాల్గొని పులివెందులకు బయలుదేరి వెళ్తారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే కె.నారాయణస్వామి తెలిపారు.
0 comments:
Post a Comment