బాధితులకు అండగా... బాబు మోసాలను ఎండకడదాం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాధితులకు అండగా... బాబు మోసాలను ఎండకడదాం

బాధితులకు అండగా... బాబు మోసాలను ఎండకడదాం

Written By news on Thursday, December 4, 2014 | 12/04/2014


బాధితులకు అండగా... బాబు మోసాలను  ఎండకడదాం
5న జరిగే మహాధర్నాలో కార్యకర్తలు,{పజలు పాల్గొనాలని పిలుపు
కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం
 వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ముత్తుముల అశోక్‌రెడ్డి

 
ఒంగోలు అర్బన్: ఎన్నికల ముందు హామీల వర్షం కురిపించిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా మాట నిలబెట్టుకోలేదు. మాట తప్పిన చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ఈ నెల ఐదో తేదీన (శుక్రవారం)  కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ముత్తుముల అశోక్‌రెడ్డి తెలిపారు. ఆయన బుధవారం   ఒంగోలులోని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పదవిలోకి వచ్చి అయిదు నెలల కాలంలో ఏభైమోసాలు చేశారని ఆరోపించారు.

వ్యవసాయ రుణాల మాఫీపై పూటకో కట్టుకథ చెబుతున్నారని, అదేవిధంగా డ్వాక్రా రుణాలపై కూడా స్పష్టమైన వైఖరి అవలంభించడం లేదన్నారు. పేదలకిచ్చే పింఛన్లను వెయ్యి రూపాయలకి పెంచుతున్నామని చెబుతూ మరోవైపు జిల్లాలోనే 45 వేల మందిని  అనర్హులుగా చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రమాణ స్వీకారం రోజునే చంద్రబాబునాయుడి అసలు రూపం బట్టబయలైందని ఎద్దేవా చేశారు. రుణమాఫీ చేస్తానన్న చంద్రబాబు రైతులని, డ్వాక్రా మహిళలని రుణ గ్రస్తులని చేశాడని మండిపడ్డారు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్న చంద్రబాబు ఉన్న ఉద్యోగాలను తీసివేశారని విమర్శించారు. బాబు వచ్చాడు జాబు పోయిందనే విధంగా ఆయన పాలన ఉందన్నారు. చివరికి బెల్టు షాపులు అరికట్టడంలో కూడా చంద్రబాబు విఫలమయ్యారని అన్నారు. 70 సంవత్సరాలు దాటిన వృద్ధులను కూడా అనర్హులుగా చూపించి ఇస్తున్న 200 రూపాలయల ఫించను కూడా తీసేయడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో అమలు సాధ్యం కాని హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చి ప్రజలను నిట్టనిలువునా మోసం చేశారని, ఆ మోసాలను ఎండకట్టడానికే వైఎస్‌ఆర్‌సీపీ మహాధర్నాని చేపట్టిందని వివరించారు. చివరికి రేషన్ కార్డులు కూడా తీసేయడం పేదల పొట్టకొట్టడమేనన్నారు. మేలు చేస్తాడని నమ్మిన ప్రజలను నిలువునా మోసం చేసిన చంద్రబాబు దుర్మార్గాలను బయటపెట్టే నేపధ్యంలో చేపట్టే ఈ ధర్నాలో బాధితులంతా పాల్గొని వంచనని ఎలుగెత్తి చాటాలని పిలుపునిచ్చారు. వైఎస్‌ఆర్ సీపీ జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ శనగ రైతుల విషయంలో చంద్రబాబు నయవంచన చేశాడని ఆగ్రహం వెలిబుచ్చారు. రుణమాఫీ విషయంలో శనగై రెతులకి ఎన్నో ఆంక్షలు పెట్టి కనీసం శనగ నిల్వలు అమ్ముకొనే పరిస్థితి కూడా లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 2010 నుంచి ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు అందాల్సిన నష్టపరిహారాన్ని కూడా ఇంతవరకు ఇవ్వకపోవడం బాధకరమని అన్నారు.

జిల్లా అధికార ప్రతినిధి కటారి రామచంద్రరావు మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా తొలి సంతకం చేసే రోజునే ప్రజలకిచ్చిన హామీని నిలబెట్టుకోవడంతోపాటు హామీలివ్వని ఎన్నో సంక్షేమ కార్యాక్రమాలు చేపట్టారని, ఆయన ఆదర్శంతో చంద్రబాబు కొంతైనా మారాలని అన్నారు. సమావేశంలో వైయస్‌ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.రమణారెడ్డి, ప్రచార విభాగం జిల్లా కన్వీనర్ వేమూరి సూర్యనారాయణ, బీసీ సెల్ కన్వీనర్ కటారి శంకర్, విజయవాడ ఇన్‌ఛార్జి వై. వెంకటేశ్వరరావు, ఎస్సీ సెల్ కన్వీనర్ కంచర్ల సుధాకర్, తోటపల్లి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: